హైదరాబాద్:  బార్లు, క్లబ్ లకు అనుమతిని ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నాడు అనుమతి ఇచ్చింది. కానీ, పర్మిట్ రూమ్ లకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. 

also read:మందుబాబులకు గుడ్‌న్యూస్: తెలంగాణలో రాత్రి 10 గంటల వరకు వైన్స్ షాపులు ఓపెన్

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి బార్లు, క్లబ్బులను మూసివేశారు.పర్మిట్ రూమ్ లకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. క్లబ్ లలో  ఈవెంట్స్, డ్యాన్స్ లకు అనుమతి ఇవ్వలేదు.కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని  ప్రభుత్వం స్పష్టం చేసింది.సుమారు ఆరు మాసాల పాటుగా రాష్ట్రంలో బార్లు, క్లబ్ లను మూసివేశారు.  

also read:ఏపీలో భారీగా పడిపోయిన మద్యం విక్రయాలు: రూ.2,885.82 తగ్గిన ఆదాయం

ఆరు మాసాల పాటు క్లబ్బులు, బార్లను మూసివేసినందున  మరో ఆరు మాసాల పాటు  లైసెన్సులను రెన్యూవల్ చేయాలని  బార్లు, రెస్టారెంట్ల యజమానులు కోరుతున్నారు.  గత ఆరు మాసాలుగా  బార్లు ఓపెన్ చేయని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బార్ల యజమానులు ప్రకటించారు.

ఈ ఏడాది మే 6వ తేదీన మద్యం దుకాణాలను తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. మద్యం దుకాణాలను ఓపెన్ చేసే సమయంలో మద్యం ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.