Asianet News TeluguAsianet News Telugu

షాకిచ్చిన కేసీఆర్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 'మే'లో కూడ సగం జీతమే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం వేతనాలు మాత్రమే ఇవ్వనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక శాఖకు ప్రభుత్వం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.

telangana government decides to pay half salary to government employees in may month
Author
Hyderabad, First Published May 27, 2020, 5:24 PM IST


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం వేతనాలు మాత్రమే ఇవ్వనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక శాఖకు ప్రభుత్వం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.

లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది మార్చి 23వ తేదీ నుండి రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంది.

మార్చి, ఏప్రిల్ మాసాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం మాత్రమే వేతనాలను ఇచ్చారు. మే మాసంలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు.

పెన్షనర్లకు పూర్తి స్థాయి వేతనం ఇచ్చే అవకాశం ఉంది. పెన్షనర్లకు పూర్తిస్థాయి వేతనం ఇవ్వాలని బుధవారం నాడు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు పెన్షనర్లకు పూర్తిస్థాయి వేతనాలు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

also read:ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్: మే నెలలో పూర్తి వేతనం

మార్చి, ఏప్రిల్ మాసాల వేతనాలకు సంబంధించినట్టుగానే మే మాసంలో కూడ ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతాలు మాత్రమే ఇవ్వనున్నారు. ఏపీ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వాలని ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్ధిక శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. 

ఇక తెలంగాణ రాష్ట్రంలో  ప్రజా ప్రతినిధులు, ఐఎఎస్, ఐపీఎస్ లు, ప్రభుత్వ ఉద్యోగులు నాలుగో తరగతి ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో ప్రభుత్వం కోత విధించింది. 

ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రివర్గం సభ్యులు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75% కోత విధించారు. వీరందరికి 25 శాతం వేతనం  మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్రంలో వీరి సంఖ్య 160 మంది. 

ఐఏఎస్,ఐపీఎస్,ఐఎఫ్ఎస్  తరహా ఆలిండియా సర్వీసు అధికారుల వేతనాల్లో 60శాతం కోత పెట్టారు. రాష్ట్రంలో . వీరి సంఖ్య 350 మంది ఉంటారు. 
మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50శాతంకోతవిధిస్తున్నారు. ఈ ఉద్యోగుల సంఖ్య 2.80 లక్షలుగా ఉంటుందని అంచనా.

నాల్గో తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తారు. నాల్గోతరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10శాతం కోత విధిస్తారు. వీరి సంఖ్య: లక్షా 35 వేలుగా ఉంది. 

అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత పెడుతున్నారు. వీరి సంఖ్య: లక్షా 23 వేలుగా ఉంది. అయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో పెన్షనర్లకు పూర్తి వేతనం చెల్లించే ఛాన్స్ లేకపోలేదు.

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రానికి ఆదాయం లేదు. దీంతో మూడో నెలలో కూడ ఉద్యోగులకు సగం వేతనం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. మూడు మాసాల సగం జీతాలు ఎప్పుడు చెల్లిస్తారనే విషయమై ప్రభుత్వం స్పష్టం చేయలేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios