ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్: మే నెలలో పూర్తి వేతనం
ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. మే మాసం వేతనాన్ని పూర్తిగా చెల్లించనుంది.ఈ మేరకు ట్రెజరీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో రెండు మాసాలుగా ప్రభుత్వ ఉద్యోగులకు సగం వేతనం మాత్రమే చెల్లించిన విషయం తెలిసిందే.
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. మే మాసం వేతనాన్ని పూర్తిగా చెల్లించనుంది.ఈ మేరకు ట్రెజరీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో రెండు మాసాలుగా ప్రభుత్వ ఉద్యోగులకు సగం వేతనం మాత్రమే చెల్లించిన విషయం తెలిసిందే.
మే మాసంలో ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించేందుకు వీలుగా ట్రెజరీ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేర్పులు చేయనున్నారు. ఈ మేరకు సీఎఫ్ఎంఎస్ మార్పులు చేర్పులకు రంగం సిద్దం చేసింది.
also read:కరోనా దెబ్బ: గత నెల మాదిరిగానే ఏపీ ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పూర్తి జీతం
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి మూడో వారం నుండి లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ కారణంగా మార్చి, ఏప్రిల్ మాసాల వేతనాలను విడతల వారీగా చెల్లించనున్నట్టుగా ప్రకటించింది. ఉద్యోగుల హోదాను బట్టి వేతనాలను విడతల వారీగా అందించారు.
ఈ రెండు మాసాలు అదే రకంగా చెల్లించారు. ఇవాళ్టి నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం ఉద్యోగులు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లలో ఉద్యోగులు విధులకు హాజరయ్యారు.
మే మాసం జీతాలను ఉద్యోగులకు పూర్తి స్థాయిలో చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు ఇవాళ ఆర్ధికశాఖను ఆదేశించారు. గత రెండు మాసాలకు సంబంధించిన బకాయిల విషయమై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.