హైదరాబాద్: పది రోజుల తర్వాత తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్  మంగళవారం నాడు ప్రారంభమైంది. వ్యాక్సిన్ల కొరత కారణంగా 10 రోజులుగా వ్యాక్సినేషన్  నిలిచిపోయింది. సోమవారం నాడు  కరోనాపై అధికారులతో సీఎం కేసీఆర్ సుదీర్థంగా సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్ష సమావేశంలో   ఇవాళ్టి నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు.

రెండో డోసు వారికే వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. కోవాగ్జిన్ డోసులను అందిస్తున్నారు.  మొదటి డోసు మాత్రం ప్రస్తుతం ఇవ్వడం లేదు. రెండో డోసు  గడువు ముగిసిన వారికే ప్రస్తుతం వ్యాక్సిన్ అందించనున్నారు. మొదటి డోసు కావాలనుకొనేవారు ఇంకా కొంత కాలం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. 

also reead:జీహెచ్ఎంసీలో కరోనా జోరు: తెలంగాణలో కోవిడ్ కేసులు 5,56,320కి చేరిక

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కోసం అవసరమైన టీకాల సరఫరా కోసం ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచింది. జూన్ 4 వరకు టెండర్ల దాఖలుకు ప్రభుత్వం గడువును విధించింది. రాష్ట్రంలోని 4 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు వీలుగా వ్యాక్సిన్లను సరఫరా చేయాలని  రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు జారీ చేసిన విషయం తెలిసిందే.