Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ నిరుద్యోగులకు ఇక మంచిరోజులే

  • తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
  • వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి సిద్దమైన ప్రభుత్వం
telangana employment notifications

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రం ఏర్పడగానే కొలువుల జాతర ఉంటుందని కోటి ఆశలతో ఎదురుచూసిన నిరుద్యోగ యువతను ప్రభుత్వం నిరుత్సాహపర్చింది. అరకొరగా ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేసి మమ అనిపించుకుంది.  అయితే ఈ ప్రభుత్వం పై  యువతలో వ్యతిరేకత ఎక్కువవుతుందని గ్రహించిన కేసీఆర్ ప్రభుత్వం ఎట్టకేలకు వరుస ఉద్యోగ నోటిఫికేషన్లతో యువతలో శాంతింపజేయాలని చూస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం టీఎస్ పిఎస్సి, పోలీస్ శాఖ ద్వారా భారీ ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనుంది. 

 ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్లో 14.700 ఉద్యోగాల భర్తీ ప్రభుత్వం అనుమతించింది. ఇందుకోసం మార్చి లో నోటిఫికేషన్ రానుంది. ఇక ఇదే మార్చి నెలలో 700 వీఆర్వో ఉద్యోగాలకు,  1500 గ్రూప్4  ఉద్యోగాలకు నోటిపికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎప్రిల్ లో 2200 పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుంది. అదే నెలలో  193  గ్రూప్1 , జూన్ లో 750 గ్రూప్2, ఆగస్ట్ లో 975  గ్రూప్3 ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్లు రానున్నాయి. 

ఎన్నో సంవత్సరాలుగా నిరుద్యోగులు గ్రూప్1, గ్రూప్2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈసారికి సిలబస్ మార్చ లేకుండానే పాత పద్దతిలోనే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం బావిస్తోంది.  అందుకే గ్రూప్1,గ్రూప్2 నోటిఫికేషన్లు జూన్ తర్వాత రానున్నాయి. ఆ లోపు మిగతా  ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి నియామకాలు చేపట్టి ఈఆ తర్వాత వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం, టీఎస్ పీఎస్సి భావిస్తున్నట్లు సమాచారం.

 

Follow Us:
Download App:
  • android
  • ios