హైదరాబాద్: విద్యా సంస్థల రీ ఓపెన్ చేసే విషయంలో ఈ నెల 25వ తేదీ నాటికి మార్గదర్శకాలను సిద్దం చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.

వచ్చే నెల 1వ తేదీనుండి విద్యా సంస్థలను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ విషయమై మంగళవారం నాడు విద్యాశాఖ ఉన్నతాధికారులతో  మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యా సంస్థల రీ ఓపెన్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

also read:గుడ్‌న్యూస్: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి స్కూల్స్ రీఓపెన్

ఈ నెల 25వ తేదీ నాటికి ఉపాధ్యాయులు, యాజమాన్యం సిద్దం కావాలని మంత్రి సూచించారు. క్లాసులు ఎలా నిర్వహించాలనే దానిపై కూడ మంత్రి చర్చించారు. ఈ విషయమై ప్రణాళికను రూపొందించి ఈ నెల 20వ తేదీ లోపుగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని  మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో ఈ నెల 16వ తేదీన మంత్రి సమావేశం కానున్నారు. ప్రైవేట్ సంస్థల్లో తీసుకోవాల్సిన చర్యలపై  మంత్రి చర్చించనున్నారు.కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి మాసంలో విద్యా సంస్థలు మూసివేశారు.  కరోనా కేసులు తగ్గుతుండడం వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో విద్యా సంస్థలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.