Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ డిఎస్సీ వేస్తే రామకృష్ణ బతికేవాడే..

  • రామకృష్ణను బలి తీసుకున్నది కేసిఆర్ సర్కారే
  • మూడేళ్లయినా డిఎస్సీ వేయకనే ఆత్మబలిదానం
  • రామకృష్ణ కుటుంబ  కష్టాలు చూసి కంటతడి పెట్టుకున్న జెఎసి నేతలు
telangana Dsc would have saved Ramakrishna s life

ఆత్మబలిదానం చేసుకున్న డిఎస్సీ నిరుద్యోగ అభ్యర్థి రామకృష్ణను ఓయు జెఎసి నేతలు పరామర్శించారు. రామకృష్ణది ముమ్మాటికీ కేసిఆర్ ప్రభుత్వ హత్యేనని ఓయూ జేఏసీ ఆరోపించింది. బుధవారం ఓయూ జేఏసీ నేతలు ప్రత్యేక బస్సులో ఉస్మానియా నుంచి వెళ్లి నారాయణఖేడ్ లోని రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణ కుటుంబ నేపథ్యం తెలుసుకున్న ఓయు జెఎసి నేతలు కన్నీటిపర్యంతమయ్యారు. ఓయు జెఎసి నేతలు చెప్పిన రామకృష్ణ కుటుంబ వివరాలు ఇవి.

telangana Dsc would have saved Ramakrishna s life

రామకృష్ణది నారాయణఖేడ్ పట్టణం. ముదిరాజ్ కులానికి చెందినవాడు. తండ్రి 7 సంవత్సరాల కిందనే గుండెపోటుతో చనిపోయిండు. తల్లి అంజమ్మ కుటుంబ భారాన్ని మోస్తున్నది. రామకృష్ణకు ఇద్దరు అక్కలు. అక్కలకు పెండ్లిల్లు అయినయ్. తను 3 వ వాడు. తనకు ఒక తమ్మడు, ఒక చెల్లె. ఇంటి దగ్గర చిన్న హోటల్ నడుపుకొని బతుకుతరు. వేరే ఆధారం లేదు.

రామకృష్ణ 2013 లో ఘట్ కేసర్ లోని లలిత కాలేజీలో బీఎడ్ చేశాడు. తనతో పాటు చెల్లెలు భాగ్యలక్ష్మీని కూడా చదివించాడు. తను టీటీసీ చేసింది. వీరి చదువు కోసం ఉన్న చిన్నపాటి ఇల్లును అమ్ముకున్నది ఆ కుటుంబం. అగో డీఏస్సీ.. ఇగో డిఎస్సీ అనే ప్రభుత్వ తప్పుడు ప్రకటనలతో లక్ష రూపాయలు అప్పుచేసి మరీ డిఎస్సీ కోచింగ్ తీసుకున్నరు. రామకృష్ణ 2015 లో అవనిగడ్డలో కోచింగ్ తీసుకున్నడు. దీని కోసం రూ. 50000 ఖర్చు అయింది. తన చెల్లెలికి హైదరాబాదులోని రామయ్య ఇనిస్టిట్యూట్లో కోచింగ్ ఇప్పించిండు. దీని కోసం రూ. 30000 ఖర్చు అయింది. మిగతా ఖర్చులు కలుపుకోని మొత్తం రూ. లక్ష అయింది. ఇద్దరు డీఏస్సీలో ఉద్యోగాలు సాధించి, ఈ అప్పులు తీర్చాలని అనుకున్నారు. తనకు జాబ్ వస్తే చెల్లె పెళ్లి ఘనంగా చేయాలని అనుకున్నడు. కోచింగ్ ముగించుకొని వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా డీఏస్సీ రాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. కొన్ని రోజుల నుండి తిండి తినడం తగ్గించాడు. దీంతో తీవ్రమైన జ్వరానికి గురయ్యాడు. నెల రోజులు అనారోగ్యంతో మంచం పట్టాడు. గత నెల 26 తేదీన చనిపోయాడు.

నిరుద్యోగుల పట్ల ఈ కేసీఆర్ నిరంకుశ విధానాల పట్ల విసుగు చెంది తనకు తానే మరణ శాసనాన్ని రాసుకున్నాడు రామకృష్ణ. ఇంత జరిగినా కూడా స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాని, ప్రభుత్వ అధికారులు కానీ రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించక పోవడం అత్యంత బాధాకరం. వీరి దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయిన ఓయూ జేఏసీ నాయకులు, రామకృష్ణ చెల్లెలికి హైదరాబాద్లో డీఏస్సీ కోచింగ్ కు అయ్యే అన్నీ వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా.. రామకృష్ణ తమ్ముడు జ్ఞానేశ్వర్ కి స్థానికంగా ప్రభుత్వమే ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓయు జెఎసి ననేతలు సలీం పాష తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Follow Us:
Download App:
  • android
  • ios