టీఆర్ఎస్ అధిష్టానంపైనా, ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కొండా మురళీ. తమకు ఆత్మాభిమానం ఎక్కువని.. మేం దొరల కింద బతకలేమని.. పోరాటాలతో ఈ స్థాయికి వచ్చామని ఆయన అన్నారు

టీఆర్ఎస్ అధిష్టానంపైనా, ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కొండా మురళీ. తమకు ఆత్మాభిమానం ఎక్కువని.. మేం దొరల కింద బతకలేమని.. పోరాటాలతో ఈ స్థాయికి వచ్చామని ఆయన అన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలు, దళితులను అణగదొక్కుతున్నారని.. మొన్న ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో రెడ్లు, వెలమలు ఇతర అగ్రవర్ణాల వారికే పెద్ద పీట వేశారని ఆయన ఆరోపించారు. నిజాయితీతో పనిచేసే తమ వంటి వారిని కాదని.. బయటి పార్టీల నుంచి వచ్చిన వారికి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కొండా మురళీ అన్నారు.

దయాకర్‌రావుతో తనకు 30 సంవత్సరాల నుంచి వైరం వుందని.. ఆయన వల్ల ఎంతోమంది రోడ్డున పడ్డాయన్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయించి సురేఖను లక్ష మెజారిటీతో గెలిపిస్తానని.. భూపాల్‌పల్లి, పరకాల, వరంగల్‌ నుంచి తమ కుటుంబసభ్యులు పోటీ చేస్తారని.. అది ఏ పార్టీ నుంచా.. లేక ఇండిపెండెంట్‌గానా అనేది త్వరలోనే ప్రకటిస్తామని మురళీ స్పష్టం చేశారు.