తమ పార్టీకి వీడ్కోలు చెప్పి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కొండా సురేఖపై టీఆర్ఎస్ నేతలు ఫైరయ్యారు. మాజీ ఉప ముఖ్యమంత్రి టీ. రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలో చేరుతూ సురేఖ తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు

తమ పార్టీకి వీడ్కోలు చెప్పి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కొండా సురేఖపై టీఆర్ఎస్ నేతలు ఫైరయ్యారు. మాజీ ఉప ముఖ్యమంత్రి టీ. రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలో చేరుతూ సురేఖ తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు.

ఉద్యమ సమయంలో సమైక్యవాదియైన వైఎస్ జగన్‌కు ఆమె మద్ధతు పలికారని.. దీంతో ఉద్యమకారులు కొండా కుటుంబంపై దాడికి పాల్పడ్డారన్నారు. దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్న కొండా ఫ్యామిలీకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులిచ్చి కేసీఆర్ తిరిగి రాజకీయ భిక్ష పెట్టారని రాజయ్య అన్నారు.

టికెట్ ఇవ్వనందుకు కేసీఆర్ పైనా... ఆయన కుటుంబం పైనా కొండా దంపతులు విమర్శలు చేయడం సరికాదన్నారు. సురేఖక్క ఎమ్మెల్యేగా గెలవాలని.. టీఆర్ఎస్‌లో ఉండాలని వరంగల్ ప్రజలు కోరుకున్నారే తప్పించి.. కాంగ్రెస్‌కు వెళ్లాలని ఎవరు కోరుకోలేదన్నారు.

మరోనేత స్పందిస్తూ కొండా దంపతులు ఏ పార్టీలో చేరినా మా పార్టీపై ఏ ప్రభావం ఉండదన్నారు.. ఆరు నియోజకవర్గాల్లో కాదు కదా.. ఆరు డివిజన్లలో కూడా కొండా ప్రభావం ఉండదని ఆయన అన్నారు.

సత్తా చూపుతాం: కాంగ్రెస్‌లో చేరిన కొండా దంపతులు

కొండా దంపతులు.. అందుకే అలా మాట్లాడుతున్నారు..వినయ్

దొరల కింద బతికేవాళ్లం కాదు.. సురేఖను లక్ష మెజారిటీతో గెలిపిస్తా: కొండా మురళీ

15 పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొండా సురేఖ..?

నేను హరీశన్న వర్గం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు