Asianet News TeluguAsianet News Telugu

కళ్లు నెత్తికెక్కాయా, టచ్ చేసి చూడు.. బిడ్డా బతుకుతావా: బండి సంజయ్‌కి కేసీఆర్ వార్నింగ్

కేసీఆర్‌ను టచ్ చేసి చూడాలంటూ బండి సంజయ్‌కి ఆయన వార్నింగ్ ఇచ్చారు. నన్ను జైలుకు పంపుతావా.. బలుపా... అహంకారమా.. కేసీఆర్‌ను జైలుకు పంపి బతికి బట్టకడతావా అంటూ బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు సీఎం. బండి మాటల్ని ఇన్నాళ్లు క్షమించానని.. ఎందుకులే ఈ గొడవలు అని మేం ఊరుకున్నామని కేసీఆర్ తెలిపారు.

telangana cm kcr warns state bjp president bandi sanjay
Author
Hyderabad, First Published Nov 7, 2021, 8:56 PM IST

కేంద్రం ఒకలా వ్యవహరిస్తుంటే.. రాష్ట్ర బీజేపీ (telangana bjp) అధ్యక్షుడు (bandi sanjay) మరోలా మాట్లాడుతున్నారని సీఎం ఆగ్రహం కేసీఆర్ (kcr) వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని.. రాష్ట్ర బీజేపీ నేతల మాటలు విని వరిపంట పండిస్తే రైతులు నష్టపోతారని కేసీఆర్ హితవు పలికారు. ఏడేళ్ల పాటు ఎంతో సామరస్యంగా వున్నామని.. చిల్లర రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాలు తాకట్టు పెడితే సహించేది లేదని కేసీఆర్ హెచ్చరించారు. ఏనుగులు వెళుతుంటూ కుక్కలు మొరుగుతాయిలే అని ఊరుకున్నామని.. పంట (paddy) కొనబోమని చెప్పేది వీళ్లేనని, వరిపంట వేయాలని చెప్పేది వాళ్లేనంటూ సీఎం దుయ్యబట్టారు. 

రాష్ట్రాల వాటాను ఎగ్గొడుతూ కేంద్రం సెస్ కింద వసూలు చేస్తోందని.. ట్యాక్సుల రూపంలో కాకుండా సెస్ ద్వారా వసూలు చేస్తూ రాష్ట్రాల పొట్టకొడుతున్నారని సీఎం మండిపడ్డారు. కొండంత పెంచి పిసరంత తగ్గించారని.. మేం తగ్గించాం కాబట్టి మీరు తగ్గించాలని అంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ధర్నా మీరు చేయాలా..? మేము చేయాలా.. తనను వ్యక్తిగతం తిట్టినా పట్టించుకోలేదన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని బండి సంజయ్ లేఖ ఇప్పించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కొండపెంచి పిసరంత తగ్గించారని.. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యాట్‌లో ఒక్క పైసా కూడా మేం పెంచలేదని సీఎం గుర్తుచేశారు. 

కేసీఆర్‌ను టచ్ చేసి చూడాలంటూ బండి సంజయ్‌కి ఆయన వార్నింగ్ ఇచ్చారు. నన్ను జైలుకు పంపుతావా.. బలుపా... అహంకారమా.. కేసీఆర్‌ను జైలుకు పంపి బతికి బట్టకడతావా అంటూ బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు సీఎం. బండి మాటల్ని ఇన్నాళ్లు క్షమించానని.. ఎందుకులే ఈ గొడవలు అని మేం ఊరుకున్నామని కేసీఆర్ తెలిపారు. దమ్ముంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్రం నుంచి ఆర్డర్లు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. నన్ను జైలుకు పంపుతావా.. అహంకారామా, కళ్లు నెత్తికెక్కాయా అంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు. 

రైతు చట్టాలపై (farm laws) పోరాడతామని.. కేంద్ర ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని హెచ్చరించారు. ఢిల్లీ బీజేపీ వరిపంట వేయొద్దని చెబుతుంటే సిల్లీ బీజేపీ వరి వేయమంటోందని ఆయన సెటైర్లు వేశారు. నా మెడలు వంచుడు కాదని.. నీ మెడలు విరుస్తానని .. కోటిన్నర టన్నుల బాయిల్డ్ రైస్ తీసుకుంటామని సిల్లీ బీజేపీ ఆర్డర్ తీసుకురావాలని కేసీఆర్ సవాల్ విసిరారు. మెడలు ఏ ప్రభుత్వానివి వంచాలో ప్రజల ముందు పెడతామని.. తాము వందకు వంద శాతం దళితబంధు అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇన్ని రోజులు మీ ఆటలు చెల్లినయ్ బిడ్డా అంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఏం తమాషాలు చేస్తున్నారనా.. ఏంటీ మీ అరాచకాలు అంటూ విమర్శించారు.  నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని కేసీఆర్ హెచ్చరించారు. చిల్లర రాజకీయాల్ని ఇక సహించం బీ కేర్ ఫుల్ అంటూ ఫైర్ అయ్యారు. 

ALso Read:కేంద్రం మెలిక.. విధిలోని స్ధితిలోనే యాసంగిలో వరి వద్దన్నాం: కేసీఆర్ క్లారిటీ

రాజకీయ విలువల్ని దిగజార్చుకుంటూ ఎన్నాళ్లు మోసం చేస్తారని.. బండి సంజయ్‌కు ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే ఢిల్లీ నుంచి ఆర్డర్ తీసుకురావాలన్నారు. రైతులు ఈ అల్లాటప్పా మాటల్ని నమ్మొద్దని.. ప్రాజెక్ట్‌ల్లో అవినీతి జరిగిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చాడా.. కేంద్రం ఇచ్చే లెటర్లను బండి సంజయ్ చదవగలడా అని కేసీఆర్ సెటైర్లు వేశారు. 

కేసీఆర్ బతికి ఉన్నంతకాలం దళితబంధు అమలు చేసి తీరతామని సీఎం స్పష్టం చేశారు. బండి సంజయ్‌కు నెత్తి లేదు.. కత్తి లేదు. నా స్థాయి కాదని బండి సంజయ్‌ని ఇన్నాళ్లూ వదిలేశా. కానీ, చిల్లర రాజకీయాల కోసం రైతాంగం నష్టపోయేలా చేస్తున్నారు. రైతుల కోసమే ఇవాళ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నా. వర్షాకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పక పోయినా .. ధైర్యంగా ముందుకొచ్చి ఏదైతే అదవుతుందని కొనుగోలు చేస్తున్నామన్నారు. ఓ వైపు రైతులను కేంద్ర మంత్రి కార్లతో తొక్కిస్తున్నారని... రైతులను కొట్టాలని బీజేపీ సీఎంలు రెచ్చగొడుతున్నారు అని కేసీఆర్‌ మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios