Asianet News TeluguAsianet News Telugu

కేంద్రం మెలిక.. విధిలోని స్ధితిలోనే యాసంగిలో వరి వద్దన్నాం: కేసీఆర్ క్లారిటీ

యాసంగిలో వరి (paddy) పంట వేయకుండా ఇతర పంటలు వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి (niranjan reddy) చెప్పారని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) . కేంద్రం కావాలనే మెలికలు పెడుతోందని.. బాయిల్డ్ రైస్ భవిష్యత్తులో ఇవ్వమని చెబితేనే కొంటామని కేంద్రం చెప్పిందని కేసీఆర్ పేర్కొన్నారు. విధిలేని పరిస్ధితుల్లోనే యాసంగిలో వరిసాగును వేయొద్దని రైతులకు చెప్పామని ఆయన అన్నారు.

telangana cm kcr pressmeet on paddy issue
Author
Hyderabad, First Published Nov 7, 2021, 8:08 PM IST

యాసంగిలో వరి (paddy) పంట వేయకుండా ఇతర పంటలు వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి (niranjan reddy) చెప్పారని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) . ఆదివారం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. యాసంగిలో వరిని వేయొద్దు అని చెప్పడానికి కారణాలు వున్నాయని తెలిపారు. ధాన్యం సేకరించే కేంద్ర ప్రభుత్వం.. మేం కొనుగోలు చేయమని కరాఖండీగా చెప్పిందని, రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో వ్యవసాయ మంత్రి వరిని వద్దని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎటు చూసినా రైతుల ఆత్మహత్యలతో పాటు వ్యవసాయం కకావికలమై వుందని.. పాలమూరు, మెదక్, నల్గొండ జిల్లాల నుంచి రైతులు కూలీ పనుల కోసం వలస వెళ్లేవారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత .. రాష్ట్రాన్ని తీర్చిదిద్దే అవకాశాన్ని ప్రజలు అధికారం రూపంలో కట్టబెట్టారని సీఎం గుర్తుచేశారు. 

దీంతో ఒక స్థిరమైన లక్ష్యంతో తెలంగాణలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేయాలని, వ్యవసాయాన్ని స్థీరకరణ చేయాలని, వృత్తి పనివారికి ఉపాధి కల్పించాలని ఒక పాలసీ ప్రకారం ముందుకు వెళ్లామని కేసీఆర్ తెలిపారు. ఆ దిశగానే భూగర్భ జలాలను పెంచేందుకు గాను మిషన్ కాకతీయ పేరుతో చెరువులు నింపే కార్యక్రమం చేపట్టామన్నారు. ఆ తర్వాత విద్యుత్ (power supply) రంగాన్ని పూర్తిగా సంస్కరించామని, 24 గంటల పాటు అన్ని రంగాలకు భారతదేశంలో మరే రాష్ట్రం ఇవ్వని విధంగా విద్యుత్ సరఫరా చేశామని కేసీఆర్ వెల్లడించారు. దీనితో పాటు సన్న, చిన్నకారు రైతుల కోసం పెట్టుబడి సాయం కింద రైతుబంధు (rythu bandhu) తీసుకొచ్చామన్నారు. తొలుత రూ.4 వేలతో ప్రారంభించి దానిని ఇప్పుడు రూ.10 వేలకు పెంచినట్లు సీఎం వెల్లడించారు. రైతులు చనిపోతే కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో రూ.1300 కోట్లకు పైగా వెచ్చింది రైతు బీమా (rythu bheema) పథకాన్ని తీసుకొచ్చామని ఆయన గుర్తుచేశారు. 

తెలంగాణ ప్రభుత్వం ఎల్ఐసీకి (lic) అతిపెద్ద కస్టమర్ అని ఎల్ఐసీ ఛైర్మన్ చెప్పారని సీఎం వెల్లడించారు. అప్పట్లో విత్తనాలు దొరికేవి కాదని.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నకిలీ విత్తనాలు అమ్మినవారిపై పీడీ యాక్ట్ తెచ్చామన్నారు. ఎరువులు కూడా దొరికేది కాదని.. రోజుల తరబడి లైన్‌లో నిలబడాల్సి వుందని, చివరికి పోలీస్ స్టేషన్‌లో పెట్టి అమ్మారని కేసీఆర్ గుర్తుచేశారు. ప్రస్తుతం ఎరువుల వాడకం తెలంగాణలో పెరిగిందన్నారు. ఎరువులను వేసవి కాలంలోనే కేంద్రం వద్ద నుంచి సేకరించి.. వాటిని నిల్వ చేసేందుకు గోడౌన్‌లను సైతం నిర్మించామని కేసీఆర్ తెలిపారు. కరోనా వంటి విపత్కర పరిస్ధితుల్లోనూ ప్రతి గ్రామంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని సీఎం వెల్లడించారు. కానీ కేంద్రం మాత్రం బాధ్యతారహితంగా ధాన్యం తీసుకోబోమని చెబుతోందని కేసీఆర్ మండిపడ్డారు. 

ధాన్యాన్ని నిల్వ చేసే ఏకైక సంస్థ ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అని ఆయన చెప్పారు. ధాన్యం తీసుకుని రాష్ట్రాలు ఏం చేయలేవని.. తాను ఢిల్లీకి వెళ్లి సంబంధిత మంత్రితో కూడా మాట్లాడానని కేసీఆర్ గుర్తుచేశారు. పంట మార్పిడి చేస్తే ప్రోత్సాహకాలు కూడా ఇవ్వమని కేంద్రం చెప్పిందని ఆయన చెప్పారు. ధాన్యాన్ని తీసుకుని స్టోరేజ్ చేసే వ్యవస్థ రాష్ట్రాల చేతిలో వుండదని.. తెలంగాణలో యాసంగి వరిపంట అంటే బాయిల్డ్ రైసేనని కేసీఆర్ తెలిపారు. కేంద్రం కావాలనే మెలికలు పెడుతోందని.. బాయిల్డ్ రైస్ భవిష్యత్తులో ఇవ్వమని చెబితేనే కొంటామని కేంద్రం చెప్పిందని కేసీఆర్ పేర్కొన్నారు. విధిలేని పరిస్ధితుల్లోనే యాసంగిలో వరిసాగును వేయొద్దని రైతులకు చెప్పామని ఆయన అన్నారు. కేంద్ర మంత్రికి ఫోన్ చేసినా స్పందన లేదని.. రా రైస్ ఎంత తీసుకుంటారో ఇప్పటికాదా కేంద్రం చెప్పలేదని కేసీఆర్ మండిపడ్డారు. బాయిల్డ్ రైస్ అసలు వద్దని కేంద్రంలోని అధికారులు చెబుతున్నారని.. వరి కంటే మంచి లాభాలు వచ్చే పంటలు వేయాలని కేసీఆర్ రైతులను కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios