హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన స్వగ్రామంలో సందడి చేస్తున్నారు. తనకు జన్మనిచ్చిన చింతమడక గ్రామంలో బిజీబిజీగా గడుపుతున్నారు. 

చింతమడక గ్రామంలో ప్రజలతో ఆత్మీయ అనురాగ సభావేదిక కార్యక్రమం నిర్వహించిన కేసీఆర్ అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం చింతమడకలోని బీసి బాలికల రెసిడెన్షియల్  స్కూల్ భవనానికి శంకుస్థాపన చేశారు. 

అనంతరం కావేరి సీడ్స్ వారు నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పాఠశాలలో మొక్క నాటారు. మరోవైపు నిర్మాణంలో ఉన్న రామాలయం పనులను పరిశలించారు. 

ఆ తర్వాత తన గురువు రాఘవరెడ్డి ఇంటిని సందర్శించారు. రాఘవరెడ్డి భార్య మంగమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. తనకు విద్యనేర్పిన గురువు గురించి కొన్ని విషయాలను అక్కడ గుర్తుకు తెచ్చారు. గురువు కుటుంబ సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్.   

ఈ వార్తలు కూడా చదవండి

"

చింతమడకకు కేసీఆర్ వరాలు, ప్రతీ కుటుంబానికి రూ.10 లక్షల పథకం : రూ.50 కోట్లు విడుదల చేసిన సీఎం

నాలుగు మూలలా నాలుగు చెరువులు...చింతమడక వాస్తు అద్భుతం: కేసీఆర్

చింతమడక చేరుకున్న కేసీఆర్, ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు