తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వగ్రామం చింతమడక చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో సొంతూరికి వచ్చిన కేసీఆర్‌కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఘనస్వాగతం పలికారు.

అనంతరం అక్కడి నుంచి బహిరంగసభ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో చిన్ననాటి స్నేహితులను కేసీఆర్ పలకరించారు.. దారి పొడవునా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం వేదికపై తనకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువుకు పాదాభివందనం చేశారు.