Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో లాక్‌డౌన్ : ఉదయం 10.10 తర్వాత జనం కనిపించొద్దు.. అధికారులకు కేసీఆర్ ఆదేశాలు

రాష్ట్రంలోని లాక్‌డౌన్ పరిస్ధితిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 గంటల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.

telangana cm kcr serious on officials over lockdown
Author
hyderabad, First Published May 21, 2021, 7:28 PM IST

రాష్ట్రంలోని లాక్‌డౌన్ పరిస్ధితిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 గంటల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.

రాష్ట్ర రెవెన్యూను లెక్క చేయకుండా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామని... కలెక్టర్లు, డీజీపీ, పోలీసు అధికారులు లాక్‌డౌన్‌ను పర్యవేక్షించాలని కేసీఆర్ సూచించారు. వారం పదిరోజుల్లో ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.

వరంగల్ సెంట్రల్ జైలును మరో చోటకు తరలిస్తామని కేసీఆర్ వెల్లడించారు. సెంట్రల్ జైలు స్థానంలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజాప్రతినిథులు, సర్పంచ్‌లు లాక్‌డౌన్‌ను స్వచ్ఛందంగా అమలు చేస్తున్నారని కేసీఆర్ ప్రశంసించారు.

Also Read:నిన్న గాంధీ... నేడు ఏజిఎం... కరోనా రోగులకు సీఎం కేసీఆర్ భరోసా

ఉదయం 10.10 తర్వాత రోడ్డుపై ఎవరూ కనిపించొద్దని సీఎం ఆదేశించారు. కోవిడ్ వార్డులో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటాని కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, కూరగాయల వ్యాపారులు, సేల్స్‌మెన్స్ కోసం వ్యాక్సిన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.

యాదాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కరోనా కేసులు తగ్గడం లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్ సెక్రటరీ ఈ జిల్లాలకు వెళ్లి పరిస్ధితులను సమీక్షించాలని సీఎం ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాలున్న జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కేసీఆర్ సూచించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios