Asianet News TeluguAsianet News Telugu

నిన్న గాంధీ... నేడు ఏజిఎం... కరోనా రోగులకు సీఎం కేసీఆర్ భరోసా

ఇటీవలే హైదరాబాద్ లోని  గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కరోనా రోగులను పరామర్శించిన సీఎం తాజాగా వరంగల్ ఏజిఎం హాస్పిటల్ ను సందర్శించనున్నారు.

today telangana cm kcr to visit mgm hospital  in warangal  akp
Author
Warangal, First Published May 21, 2021, 12:01 PM IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి  కరోనా రోగులను పరామర్శించనున్నారు. ఇటీవలే హైదరాబాద్ లోని  గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కరోనా రోగులను పరామర్శించిన సీఎం తాజాగా వరంగల్ ఏజిఎం హాస్పిటల్ ను సందర్శించనున్నారు. కరోనా బారినపడి ఏజిఎంలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి భరోసా కల్పించనున్నారు సీఎం కేసీఆర్. ఇందుకోసం ఇవాళ(శుక్రవారం) సీఎం వరంగల్ లో పర్యటించనున్నారు.

ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం గాంధీ దవాఖానాను సందర్శించిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకొన్నారు. ఆసుపత్రిలో కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలతో పాటు ఇతర విషయాలపై ఆయన ఆరా తీశారు. 
 
ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి తప్పించిన తర్వాత   వైద్య ఆరోగ్య శాఖను కేసీఆర్ తన వద్దే ఉంచుకొన్నారు. సీఎం హోదాలో కేసీఆర్ తొలిసారిగా గాంధీ ఆసుపత్రిని పరిశీలిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 1500 మంది కరోనా రోగులున్నారు. గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులను ఆయన  స్వయంగా తెలుసుకొంటున్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు.  

READ MORE మీరు ఒకసారే.. కిషన్ రెడ్డి ఏడు సార్లు: కేసీఆర్ గాంధీ పర్యటనపై బండి సంజయ్ సెటైర్లు

రోనా రోగుల వెంట తమను ఉండేలా చర్యలు తీసుకొనేలా చూడాలని కొందరు రోగులు సీఎంను కోరారు. అయితే  రోగుల వెంట ఉండేవారికి కూడ కరోనా సోకే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లతో సీఎం కేసీఆర్ చర్చించారు. 

కరోనా రోగులకు అందుతున్న భోజనం గురించి కూడ కేసీఆర్ వాకబు చేశారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని సీఎం వైద్య శాఖాధికారులకు సూచించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం గురించి ఆయన  అడిగి తెలుసుకొన్నారు. ఐసీయూలో చికిత్స తీసుకొంటున్న రోగులకు సీఎం ధైర్యం చెప్పారు.గత టర్మ్‌లో ఉస్మానియా ఆసుపత్రిలో ఆయన పర్యటించారు. ఉస్మానియా ఆసుపత్రిని కూల్చి కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios