మహిళా, బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టండి.. మోడీకి కేసీఆర్ లేఖ
ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని కేసీఆర్ లేఖ రాశారు.

ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని కేసీఆర్ లేఖ రాశారు. మహిళా బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లులపై 2014లోనే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు కేసీఆర్.
కాగా.. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, కేంద్రం తెచ్చే బిల్లుల విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.