Hyderabad: రాష్ట్రంలో కేసీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీకి గెలిచే అవకాశం లేదని పేర్కొన్న ఆయన.. ఇతర రాష్ట్రాల్లో ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు.
BJP Telangana State President Bandi Sanjay: తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్), భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ను టార్గెట్ చేశారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కేసీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీకి గెలిచే అవకాశం లేదని పేర్కొన్న ఆయన.. ఇతర రాష్ట్రాల్లో ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు.
వివరాల్లోకెళ్తే.. ‘ప్రజాగోస బీజేపీ భరోసా’ కార్యక్రమం చేపట్టిన బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల్లోకి వెళ్తోంది. పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట్ గ్రామంలో జరిగిన ప్రజా గోస బీజేపీ భరోసాలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్, బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. అలాగే, కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ సర్కారుపై ప్రశంసలు కురిపించారు.
అన్ని గ్రామాల అభివృద్దే మోడీ లక్ష్యం..
‘ప్రజాగోస బీజేపీ భరోసా’ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ సర్కారు, ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. దేశంలో మెరుగైన పాలన బీజేపీ అందిస్తున్నదని అన్నారు. అలాగే, దేశంలోని అన్ని గ్రామాల అభివృద్ధే మోడీ లక్ష్యమన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2.4 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని చెప్పారు. రోజ్‌ఘర్ మేళా పథకం కింద ఈ ఏడాది పది లక్షల ఉద్యోగాలు కల్పించారు. రైతుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు.
బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు..
‘ప్రజాగోస బీజేపీ భరోసా’ కార్యక్రమంలోప్రజలనుద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ గెలిచే అవకాశం లేదని పేర్కొన్న ఆయన.. ఇతర రాష్ట్రాల్లో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2.4 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని చెప్పారు. కానీ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కనిపించడం లేదని విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు రోజ్‌ఘర్ మేళా పథకం కింద ఈ ఏడాది పది లక్షల ఉద్యోగాలు కల్పించిందని చెప్పిన బండి సంజయ్.. 80 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం 1000 కోట్లు మాత్రమే కేటాయించిందని, అయితే 80 వేల ఉద్యోగాలకు దాదాపు 5000 కోట్లు కేటాయించాలన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు.
