రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళితే, తాను కూడా అసెంబ్లీని రద్దు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్ధేశ్యం లేదని.. కానీ కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళితే, తాను కూడా అసెంబ్లీని రద్దు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. మీరు టైం చెబితే.. అసెంబ్లీ రద్దు చేస్తామని ఆయన బీజేపీకి సవాల్ విసిరారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ లకు ముందస్తుకు వెళ్లే ధైర్యం వుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఏక్‌నాథ్ షిండేలే ఏకుమేకవుతారని సీఎం జోస్యం చెప్పారు.
దమ్ముంటే తెలంగాణలో ఏక్‌నాథ్ షిండేను తీసుకురావాలని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. తానేవరికీ భయపడనని.. తనకు మనీలేదు, లాండరింగ్ లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. మాతో గోక్కుంటే అగ్గేనని.. మీరు మాతో గోక్కున్నా .. గోక్కోకపోయినా నేను మిమ్మల్ని గోకుతూనే వుంటానని కేసీఆర్ పేర్కొన్నారు. మీ ఉడుత ఊపులకు భయపడేది లేపదన్నారు.
Also Read:జాతీయ పార్టీ లేదు.... ఫ్రంట్ వైపే మొగ్గు : తేల్చేసిన కేసీఆర్
ప్రధాని మోడీ ఏదో చెబుతాడనుకుంటే ఏం లేదంటూ సెటైర్లు వేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. వేములవాడ రాజన్న, ఏడుపాయల దుర్గమ్మ ఇదే కదా మోడీ చెప్పింది అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే నాలుగు రోజులు అతి భారీ వర్షాలు పడొచ్చనే సమాచారం వుందన్నారు. సమ్మక్క బ్యారేజ్ దగ్గర 9 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వుందని కేసీఆర్ తెలిపారు. ఎస్సారెస్పీ ఈ రాత్రికి నిండిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదని సీఎం అన్నారు. ఎస్సారెస్పీకి 4 లక్షల క్యూసెక్కుల వదర వస్తోందని కేసీఆర్ తెలిపారు. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు మూసివేయాలని ఆయన ఆదేశించారు.
వర్షాలు, వరదల్లో సాహసాలు చేయొద్దని ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి విపత్కర పరిస్ధితులైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందని సీఎం స్పష్టం చేశారు. ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. దేశాన్ని బీజేపీ జలగలా పట్టి పీడిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏం లేదని.. సున్నానేనంటూ సీఎం దుయ్యబట్టారు. ప్రధాని ప్రసంగంలో కూడా ఏం లేదన్నారు. బీజేపీ దేశానికి ఏం చేయలేదని.. తెలంగాణకైతే అసలే లేదంటూ కేసీఆర్ దుయ్యబట్టారు.
మిగిలిన వాళ్లు ఆ రోజు ప్రసంగంలో నన్ను తిట్టడం తప్ప ఏం లేదని సీఎం ఎద్దేవా చేశారు. తాను వేసిన 9 ప్రశ్నల్లో ఒక్కదానికీ మోడీ సహా ఎవ్వరూ సమాధానం చెప్పలేదంటూ చురకలు వేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొత్తం దేశాన్నే నిరాశ పరిచాయని ఆయన మండిపడ్డారు. మోడీ ప్రసంగంలో సరకు లేదు.. సంగతి లేదని కేసీఆర్ సెటైర్లు వేశారు. బీజేపీ డొల్లతనం బయటపడిందని.. ఏ దేశంలోనూ పతనం కాని కరెన్సీ విలువ భారత్ లోనే ఎందుకు పతనమవుతోందని అడిగానన్నారు. మేం అడిగిన ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పలేరని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
దేశ భవిష్యత్తుకు అవసరమైన దార్శనికత బీజేపీ దగ్గర లేదని.. అప్పుడు మోడీ అడిగిన ప్రశ్నల్నే ఇప్పుడు తాను అడుగుతున్నానని, ఎందుకు సమాధానం చెప్పట్లేదని సీఎం ప్రశ్నించారు. ఈ సందర్భంగా 2014కు ముందు మోడీ మాట్లాడిన మాటలను మీడియాకు వినిపించారు కేసీఆర్. ఎనిమిదేళ్ల పాలనలో దేశానికి మీరు చేసిన ఒక్క మంచి పని ఏంటని సీఎం ప్రశ్నించారు. మోడీ ఒక్క మంచి పని కూడా చేయలేదని.. ఇది సిగ్గుచేటంటూ చురకలు వేశారు. దేశానికి మంచి నీళ్లు ఇచ్చే తెలివితేటలు కూడా మోడీ ప్రభుత్వానికి లేవని.. ఇంత అసమర్ధ పరిపాలన తాను ఎప్పుడూ చూడలేదని కేసీఆర్ విమర్శించారు. మీ చెత్త విద్యుత్ విధానం వల్ల దేశ రాజధానిలోనే కరెంట్ కోతలు అమలవుతున్నాయని.. డబ్బాలో రాళ్లు వేసినట్లు లొడాలొడా నాలుగు మాటలు మాట్లాడితేప కుదరదని సీఎం అన్నారు.
