జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. పార్టీకి బదులు భావసారూప్యత గల పార్టీలతోనే ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. ఫ్రంట్ తోనే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. పార్టీకి బదులు భావసారూప్యత గల పార్టీలతోనే ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. ఫ్రంట్ తోనే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తప్పదు అనుకుంటే జాతీయ పార్టీ పెడతానని సీఎం పేర్కొన్నారు.
బీజేపీ ఓట్లతోనే రాష్ట్రపతిని గెలిపించుకునే అవకాశం వాళ్లకే లేదని కేసీఆర్ వెల్లడించారు. కేసులకు , జైళ్లకు భయపడేవాడిని కాదన్నారు. మూడు, నాలుగు పార్టీలు కలిపి ఫ్రంట్ పెడితే ఏమొస్తుందని ఆయన ప్రశ్నించారు. ఆ కిచిడీ ఫ్రంట్ నాలుగు నెలలు కూడా నడవదని అంటారని ... అందుకే దేశ ప్రజల్ని సమాయత్తం చేస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ తనకు ఫ్రెండ్ మాత్రమేనని.. ఆయన నాకు చెప్పేదేం వుంటుందన్నారు.
అలాంటి వాళ్లు తనకు చాలా మంది ఫ్రెండ్స్ వున్నారని... కుటుంబ పార్టీలను తొలగించాలంటే ప్రజలు తొలగించాలని, మధ్యలో బీజేపీ ఎవరని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమా..? ఈస్ట్‌మన్ కలర్ కలలు కంటున్నారంటూ కేసీఆర్ సెటైర్లు వేశారు. దిక్కుమాలిన వాళ్లు పది పదిహేను మంది పోతే ఆ పార్టీకి పోపతారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని వదులుకోరని, ఆ విషయం తమకు తెలుసునంటూ కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి రాజీనామా చేసినా మా దాంట్లో ఒక్క వికెట్టూ పోలేదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని దించి తీరతామని సీఎం స్పష్టం చేశారు. రైతుల రక్తం తాగేవాళ్లని తీసేసి , రెవెన్యూ రికార్డులను ధరణి ప్రక్షాళన చేసిందని కేసీఆర్ గుర్తుచేశారు. రైతుబంధుకు , ఎకరాలకు సంబంధం లేదన్నారు.
