కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనే అంశాల ద్వారా నిజమైన ప్రజాస్వామ్యానికి స్పూర్తిగా ఉండాలనే ఆలోచనతోనే ఉండేదన్నారు తెలంగాణ సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క.

శనివారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన మేర ఫలితాలు రాకపోయినప్పటికీ సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్లుగానే తాము భావిస్తున్నట్లు భట్టి చెప్పారు.

ఓట్లు పొందడం కోసం తాము ఎక్కడా దిగజారలేదని, కాకపోతే ఎన్నికల్లో, ఎణ్నికల ప్రక్రియలో గెలుపొటములను కొలమానంగా తీసుకునే ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఓటమిపైన విశ్లేషణ చేస్తామని విక్రమార్క పేర్కొన్నారు.

Also Read:కాంగ్రెస్ ఘోర పరాభవం: టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా

మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా తాము కూడా లోపాలను సవరించుకుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 146 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.