హైదరాబాద్:తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో సీఎం కేసీఆర్‌ చికిత్స చేయించుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో కేసీఆర్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లారు. సుమారు గంటకు పైగా కేసీఆర్ ఆసుపత్రిలోనే ఉన్నారు.

Also read:పీసీసీ చీఫ్ హోదాలో ఉత్తమ్‌కు ఇవే చివరి ఎన్నికలు

also read:మున్సిపల్ పోల్స్: కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు సవాల్

Also  read:మెజార్టీ మున్సిపాలిటీలు గెలుస్తాం: జనసేన, బీజేపీ పొత్తుపై కేటీఆర్ ఇలా..

పలు రకాల టెస్టులను కేసీఆర్‌కు వైద్యులు నిర్వహించారు. కేసీఆర్ కు టెస్టులు నిర్వహించిన వైద్యులు తీవ్ర జ్వరంతో ఆయన బాధపడుతున్నట్టుగా వైద్యులు చెప్పారు. టెస్టులు నిర్వహించిన తర్వాత సీఎం కేసీఆర్ తిరిగి ప్రగతి భవన్ కు చేరుకొన్నారు.

also read:మున్సిపల్ పోల్స్‌లో కానరాని లెఫ్ట్ అభ్యర్థులు

సంక్రాంతి పండుగ కోసం సీఎం కేసీఆర్ ఎర్రవెల్లికి వెళ్లారు. ఎర్రవెల్లిలోనే కేసీఆర్ ఉన్నారు. అయితే ఎర్రవెల్లిలో కేసీఆర్ ఉన్న సమయంలోనే ఆయనకు జ్వరం వచ్చింది. దీంతో కేసీఆర్ ఎర్రవెల్లి నుండి నేరుగా హైద్రాబాద్ కు వచ్చారు. హైద్రాబాద్ వచ్చిన కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందారు.