హైదరాబాద్:కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న లో‌క్‌సభ నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికలు  సవాల్ గా మారాయి. 

Also  read:మెజార్టీ మున్సిపాలిటీలు గెలుస్తాం: జనసేన, బీజేపీ పొత్తుపై కేటీఆర్ ఇలా..

తమ తమ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్న మున్సిపల్ పట్టణాల్లో కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

Also read:కారుకు ప్రమాదం: కొలిక్కి రాని జూపల్లి, హర్షవర్ధన్ వివాదం

Also read:తగ్గని జూపల్లి కృష్ణారావు: టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థులకు చిక్కులు

అధికార పార్టీ హావా ను అడ్డుకునేందుకు ఎంపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తమ అనుచరులను ఎన్నికల్లో విజయం సాధించేలా పావులు కదుపుతున్నారు.కానీ అధికార పార్టీ కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నచోట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. 

Also read:మున్సిపల్ ఎన్నికల వేడిలో అమెరికాకు కవిత, కారణమిదేనా....?

ఎక్కడ అలసత్వానికి చోటివ్వకుండా క్యాడర్ ను అప్రమత్తం చేస్తోంది.విపక్ష పార్టీ నేతలు ప్రాతినిత్యం వహిస్తున్న  లోకసభ నియోజకవర్గాల పై ప్రత్యేకంగా మరికొంతమంది నేతలకు అధికార పార్టీ బాధ్యతలను అప్పగించింది.

Also read:మున్సిపల్ ఎన్నికలు 2020: గులాబీ గూటిలో కొట్లాటలకు బ్రేక్ ఇలా...

 కరీంనగర్, ఆదిలాబాద్ నిజామాబాద్, నల్గొండ, మల్కాజ్ గిరి, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో అధికార పార్టీ మరోసారి విపక్షాలపై పైచేయి సాధించేందుకు ఈ ఎన్నికలను అవకాశంగా భావిస్తోంది.

లోకసభ ఎన్నికల్లో తమను ఆదరించినట్లే ఇప్పుడు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విపక్ష ఎంపీలు  మున్సిపాల్టీల్లో ఇంటింటికీ  ప్రచారం చేస్తున్నారు.ఈ ఎన్నికల్లో  కనీసం తమ పరిధిలోని మున్సిపాలిటీ ల్లో పట్టు నికుపుకుంటే....అధికారపార్టీకి బ్రేకులు వేయవచ్చన్న అభిప్రాయం విపక్ష ఎంపీల్లో కనిపిస్తోంది.