మెజార్టీ మున్సిపాలిటీలు గెలుస్తాం: జనసేన, బీజేపీ పొత్తుపై కేటీఆర్ ఇలా..
తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు జనసేన, బీజేపీ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: జనసేన పార్టీ పొత్తుల విషయంలో స్పందించిన కేటీఆర్ ఎవరి అభిప్రాయాలకు అనుగుణంగా వారు పొత్తులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని,అయితే పొత్తు పై ఏపీ ప్రజలు నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు
Also read:కారుకు ప్రమాదం: కొలిక్కి రాని జూపల్లి, హర్షవర్ధన్ వివాదం
కొత్త మున్సిపల్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని కేటీఆర్ స్పష్టంచేశారు మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సమీక్ష నిర్వహించిన కేటీఆర్ మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు
Also read:తగ్గని జూపల్లి కృష్ణారావు: టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థులకు చిక్కులు
జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. బిజెపి అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు. ఆ పార్టీ నేతలు టిఆర్ఎస్ పై చార్జీ షీట్ వేయడం సమంజసం కాదన్నారు. ఇప్పటి వరకు దేశంలో కాంగ్రెస్ ,బీజేపీలే అధికారంలో ఉన్నాయని ఆ ప్రభుత్వాలపై ఈ లెక్కన ఎన్ని చార్జిషీట్లు వేయాలని ప్రశ్నించారు.
Also read:మున్సిపల్ ఎన్నికల వేడిలో అమెరికాకు కవిత, కారణమిదేనా....?
బిజెపి నేతలు వస్తే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పనులు ప్రత్యక్షంగా చూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గృహ నిర్మాణాన్ని కూడా బిజెపి నేతలు చూపించగలరా అని ప్రశ్నించారు
Also read: మున్సిపల్ పోల్స్‌కు కాంగ్రెస్ మేనిఫెస్టో: ఓటర్లకు బంపర్ ఆఫర్స్
కాంగ్రెస్ పార్టీ నేతలు అర్థం పర్థం లేని మేనిఫెస్టో ను ప్రకటించి .....రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలను చేర్చి కొత్త పథకాలంటూ ప్రజలను మోసం చేసేందుకే ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Also read:మున్సిపల్ ఎన్నికలు 2020: గులాబీ గూటిలో కొట్లాటలకు బ్రేక్ ఇలా...
రాష్ట్రంలో చెరువుల సుందరీకరణ చూసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం అని సవాల్ విసిరారు.రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగానే మున్సిపాలిటీల వారీగా మ్యానిఫెస్టోలో అమలు చేస్తామని కామన్ మ్యానిఫెస్టో అమలు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
తెలంగాణ లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో సింహభాగం సీట్లను ఖచ్చితంగా సాధిస్తామని కాంగ్రెస్, బిజెపిలకు అభ్యర్థులు కరువయ్యారు. టిఆర్ఎస్ పార్టీలో రెబల్స్ విషయంలో కూడా త్వరలో పరిష్కరిస్తామని అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ను పరిపాలనా సౌలభ్యం కోసం విభజించినా తప్పులేదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని కేటిఆర్ స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.