పీసీసీ చీఫ్ హోదాలో ఉత్తమ్‌కు ఇవే చివరి ఎన్నికలు

మున్సిపల్ ఎన్నికల తర్వాతే తెలంగాణలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కమార్ రెడ్డి స్థానంలో కొత్త వారికి బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.

After municipal elections New PCC chief will be appointed in Telangana

 హైదరాబాద్: పీసీసీ చీఫ్ హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మున్సిపల్ ఎన్నికలే చివరి ఎన్నికలు కాబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల అనంతరం తాను పిసిసి అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకుంటానని గతంలోనే ఉత్తమ్ ప్రకటించారు.

also read:మున్సిపల్ పోల్స్‌లో కానరాని లెఫ్ట్ అభ్యర్థులు

దీంతో మున్సిపల్ ఎన్నికల్లో అయినా తన బలాన్ని చాటుకోవడానికి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయం కోసం ఉత్తమ్ పావులు కదుపుతున్నారు.

also read:మున్సిపల్ పోల్స్: కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు సవాల్

Also  read:మెజార్టీ మున్సిపాలిటీలు గెలుస్తాం: జనసేన, బీజేపీ పొత్తుపై కేటీఆర్ ఇలా..

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి  ఈ నెల 25వ తేదీన  ఫలితాలు వెల్లడికానున్నాయి.  పీసీసీ చీఫ్ మార్పు దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా కొత్త అధ్యక్షుడు రావడం ఖరారైంది. 

Also read:కారుకు ప్రమాదం: కొలిక్కి రాని జూపల్లి, హర్షవర్ధన్ వివాదం

Also read:తగ్గని జూపల్లి కృష్ణారావు: టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థులకు చిక్కులు

 ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు అందరినీ సమన్వయం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన రాజకీయ వారసుని ఎంపికలో పార్టీ హైకమాండ్‌కు పలు సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు వివరిస్తూ పిసిసి చీఫ్ గా తన  అభిప్రాయాన్ని ఇప్పటికే పార్టీ పెద్దలకు వివరించినట్లు సమాచారం.

Also read:మున్సిపల్ ఎన్నికల వేడిలో అమెరికాకు కవిత, కారణమిదేనా....?

Also read:మున్సిపల్ ఎన్నికలు 2020: గులాబీ గూటిలో కొట్లాటలకు బ్రేక్ ఇలా...

పార్టీ హైకమాండ్ కు ఒక్కరు లేదా ఇద్దరు నేతల పేర్లు సూచించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ  పదవిని దక్కించుకునేందుకు పలువురు నేతలు ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు.

 గత కొన్ని నెలలుగా పీసీసీ పదవి కోసం హైకమాండ్ తో సంప్రదింపులు జరుపుతున్న  నేతల పేర్లు దాదాపు పదిమంది పేర్లు  వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ అంశాలు బేరీజు వేస్తూ అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనే అభ్యర్థిని పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తారని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఎక్కువగా పిసిసి చీఫ్ పదవి దక్కుతుండటంతో ఈసారి ఇతర సామాజిక వర్గాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని పార్టీ హైకమాండ్ ను పలువురు నేతలు కోరుతున్నారు.

 ఇటీవలే ఏపీసీసీ చీఫ్ గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శైలజానాథ్‌ను నియమించారు. తెలంగాణలో బీసీ నేతకు అవకాశం కల్పించాలని పార్టీ హికమాండ్ ను నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలాఖరు లోపు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కొత్త రథసారథి రానున్నట్లు సమాచారం.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios