సారాంశం


వ్యవసాయం చేసేవారికే పెట్టుబడి సహాయం అందించడం వల్ల ప్రయోజనమని  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  చెప్పారు. గత ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించిందన్నారు.

హైదరాబాద్: మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది...ఈ విచారణలో   దోషులో ఎవరో  తేలుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో శనివారం నాడు బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత  అసెంబ్లీ వాయిదా పడింది.  అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత  రేవంత్ రెడ్డి  మీడియా ప్రతినిధులతో  చిట్ చాట్ చేశారు.ఈ నెల  13న మేడిగడ్డ సందర్శనకు కేసీఆర్ ను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ వాళ్లకి ఈ నెల 13న రావడం కుదరకపోతే తేదీ మారుస్తామని  రేవంత్ రెడ్డి తెలిపారు. 

వ్యవసాయం చేసే రైతులకు పెట్టు బడి సహాయం ఇచ్చేందుకే  రైతు భరోసా పథకం ఉంటుందన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయం చేయని వారికి కూడ రైతుబంధ పథకం కింద ఆర్ధిక సహాయం అందించారన్నారు.

also read:తెలంగాణ బడ్జెట్: రూ. 2 లక్షల పంట రుణమాఫీ, రైతు భరోసాపై కీలక ప్రకటన

సెక్రటేరియట్, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం  నిర్మాణంలో అవినీతిపై విచారణకు ఆదేశించనున్నట్టుగా  సీఎం చెప్పారు. వాస్తవాలపై బడ్జెట్ ఉండాలని తాము చూశామన్నారు. ఏడాదంతా అబద్దాలు చెప్పడం ఎందుకని తొలిరోజే నిజం చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి వివరించారు.రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తున్నట్టుగా  ఆయన తెలిపారు. ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆయన వివరించారు. గతంలో  ఇరిగేషన్ లో రూ. 16 వేల కోట్లు అప్పులు కట్టినట్టుగా ఆయన తెలిపారు.
అనవసరమైన టెండర్లు రద్దు చేస్తామన్నారు.ఎమ్మెల్యేలు ఎవరైనా సీఎంను కలవచ్చని ఆయన చెప్పారు. 

also read:నిరుద్యోగులకు శుభవార్త:'జాబ్ క్యాలెండర్‌పై కార్యాచరణ'

 వాళ్ల స్వంత పార్టీకే అనుమానం ఉంటే తానేం చేయాలని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని  జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొంటే  అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. 
అసెంబ్లీలో తాను తెలంగాణ భాషనే మాట్లాడుతున్నానని చెప్పారు.