తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నెల 22 నుండి కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రజత్ కుమార్ జిల్లా ఎన్నికల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. 

ఎన్నికలు జరిగే సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రజత్ కుమార్ అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా పోలింగ్ శాతం పెరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. శిథిలావస్థలో వున్న పోలింగ్ బూతులను మార్చాలనీ...పోలింగ్ కేంద్రాలన్ని పక్కా  భవనాల్లో ఉండేలా చూడాలని సూచించారు. కేవలం ఆదిలాబాద్ జిల్లాలోనే 91 సమస్యాత్మక ప్రాంతాలున్నట్లు సీఈవో వెల్లడించారు. 

ఈ నెల 25లోపు సవరించిన ఓటర్ల జాబితా రాజకీయ పార్టీలకు చేరేలా చూడాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. అలాగే భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు  పర్యవేక్షించాలన్నారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేయాలన్నారు. 

ఈ భేటీలో జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆపీసర్ ఆమ్రపాలి కూడా పాల్గొన్నారు.  ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై  అధికారులకు ఆమె పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 
 

సంబంధిత వార్తలు

ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి: రజత్ కుమార్ 

కలెక్టర్లతో టీఎస్ ఎలక్షన్ కమిషనర్ భేటీ..సోమవారం ఢిల్లీకి రజత్ కుమార్

కలెక్టర్లతో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ భేటీ: అక్టోబర్ లో షెడ్యూల్?