రెండు దఫాలు గుర్తింపు సంఘం: నేడు తుడిచిపెట్టుకుపోయిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం
రెండు దఫాలు గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఈ దఫా మాత్రం నామమాత్రం ఓట్లు మాత్రమే దక్కించుకుంది.
హైదరాబాద్: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నామ మాత్రం ఓట్లు మాత్రమే దక్కించకుంది. ఈ ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తుడిచిపెట్టుకుపోయింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధంగా ఉన్న ఎఐటీయూసీ గుర్తింపు సంఘంగా నిలిచింది. ఈ ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ ఆరు డివిజన్లలో విజయం సాధించింది. అయితే ఎఐటీయూసీ కంటే తక్కువ ఓట్లు రావడంతో గుర్తింపు సంఘంగా ఎఐటీయూసీ అవతరించింది.
2012, 2017 ఎన్నికల్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయం సాధించింది. ఈ దఫా మాత్రం ఆ సంఘం నామ మాత్రం ఓట్లు మాత్రమే సాధించింది.
ఈ దఫా గుర్తింపు ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే చివరి నిమిషంలో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా పలువురు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి రాజీనామా చేశారు.
గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎఐటీయూసీకి ఐఎన్‌టీయూసీ మద్దతిచ్చింది. కానీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయాన్ని ఆపలేకపోయారు. అయితే ఈ దఫా గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ విజయం సాధించవద్దని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి చెందిన క్యాడర్ ఎఐటీయూసీకి మద్దతుగా నిలిచారు. దీంతో గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించలేకపోయిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
also read:పార్లమెంట్ ఎన్నికలు 2024: తెలంగాణకు అమిత్ షా, ఆ స్థానాలే టార్గెట్
సీపీఐ అనుబంధ ట్రేడ్ యూనియన్ ఎఐటీయూసీ అత్యధిక ఓట్లతో ప్రథమ స్థానంలో నలిచింది. రెండో స్థానంలో ఐఎన్‌టీయూసీ నిలిచింది. అయితే సీపీఐ(ఎం)కు అనుబంధంగా ఉన్న సీఐటీయూ ఈ దఫా మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆవిర్భవించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇతర యూనియన్లను వెనక్కి నెట్టి రెండు దఫాలు గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించింది.
also read:తెలంగాణపై ఫోకస్: నేతల మధ్య కోల్డ్ వార్ పై సీరియస్, అమిత్ షా క్లాస్
తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నామ మాత్రం ఓట్లు కూడ దక్కించుకోలేక పోయింది.సింగరేణిలో మొత్తం 11 ఏరియాల్లో ఐదు ఏరియాల్లో ఎఐటీయూసీ, ఆరు ఏరియాల్లో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది.సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నామ మాత్రం ఓట్లను దక్కించుకుంది. గత రెండు టర్మ్ లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గుర్తింపు సాధించింది.