తెలంగాణ బీజేపీని న‌డిపించే నాయ‌కుడు ఆయ‌నేనా..? బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం నిర్ణ‌యం తీసుకుందా?

Hyderabad: కరీంనగర్ ఎంపీ, ప్ర‌స్తుత తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా మారుస్తారని పార్టీలోని ప‌లు వర్గాలు చెబుతున్నాయి. ఈ పుకార్లపై కిషన్ రెడ్డి స్పందిస్తూ యథాతథ స్థితి నెలకొంటుందని చెప్పారు. పార్టీలో మార్పులు ఉండ‌బోవ‌న్నారు. అయితే, నేడు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో బండి సంజ‌య్ భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. దీంతో బండి సంజ‌య్ ని తెలంగాణ బీజేపీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌నున్నారా? అనే చ‌ర్చ సాగుతోంది. 
 

Telangana BJP politics: Kishan Reddy to be Telangana BJP president?  RMA

Telangana BJP: కరీంనగర్ ఎంపీ, ప్ర‌స్తుత తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా మారుస్తారని పార్టీలోని ప‌లు వర్గాలు చెబుతున్నాయి. ఈ పుకార్లపై కిషన్ రెడ్డి స్పందిస్తూ యథాతథ స్థితి నెలకొంటుందని చెప్పారు. పార్టీలో మార్పులు ఉండ‌బోవ‌న్నారు. అయితే, నేడు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో బండి సంజ‌య్ భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. మ‌రోసారి బండి సంజ‌య్ ని తెలంగాణ బీజేపీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌నున్నారా? అనే చ‌ర్చ సాగుతోంది. ఇదే స‌మ‌యంలో సంజయ్ ని  బీజేపీ అధ్యక్ష పదవి నుండి తప్పించి  కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది.

తెలంగాణ బీజేపీలో యథాతథ స్థితి కొనసాగుతుందని కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి స్పష్టం చేసినప్పటికీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రాష్ట్రస్థాయిలో మార్పులు చేసి కిషన్ రెడ్డిని తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా తీసుకురావాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందనీ, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా మారుస్తారని గత వారం రోజులుగా వార్తలు వ‌చ్చాయి. నాయకత్వ మార్పు జరగకపోతే తమ విధేయతను మార్చుకోక తప్పదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తదితరుల నేతృత్వంలోని అసమ్మతి వర్గం అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర నేతలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అధిష్ఠానం మధ్య సుదీర్ఘ చర్చలు జరిగిన నేపథ్యంలో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నార‌ని ఆ పార్టీకి చెందిన‌ ప‌లువురు నేత‌లు పేర్కొంటున్నారు.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా జీ.కిషన్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను స్వతంత్ర శాఖతో సహాయ మంత్రిగా మార్చనున్నారు. అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉందని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపిన‌ట్టు సియాస‌త్ నివేదించింది. బీజేపీలోని పోరాట గ్రూపుల (అస‌మ్మ‌తి నాయ‌కులు) మధ్య రాజీ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా బండి సంజయ్ ను కేంద్ర సహాయ మంత్రిగా, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించే అవకాశం ఉందని టాక్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా ఢిల్లీలో కిషన్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బండి సంజయ్ లతో చర్చలు జరిపారని, నేతల మధ్య అంతర్గత విభేదాలు రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయని భావించినట్లు సమాచారం.

ఎన్నికల క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో పార్టీని నడిపించడానికి కిషన్ రెడ్డి సరైన వ్యక్తి అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా భావించి ఇదివ‌ర‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2010 నుంచి 2014 వరకు, తెలంగాణలో 2014 నుంచి 2016 వరకు కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఉంచారు. ఈ ఏడాది చివ‌ర్లో తెలంగాణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అలాగే, పార్ల‌మెంట్ లోక్ స‌భ ఎన్నిక‌లు కూడా ఉన్నాయి. దీంతో బీజేపీ అధిష్టానం వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి వ‌రుస‌గా రాష్ట్ర నాయ‌కుల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తోంద‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios