తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు బీజేపీ నేత విజయశాంతి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తీరుతో రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని విమర్శించారు. 

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు బీజేపీ నేత విజయశాంతి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తీరుతో రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని విమర్శించారు. తెలంగాణ‌లో విద్యా రంగం కోమాలోకి వెళ్లిపోయిందని.. వైద్యం వెంటిలేట‌ర్ల మీద ఉందని, రైతాంగ స‌మ‌స్య‌లు అప‌రిష్కృతంగా ఉన్నాయని రాములమ్మ మండిపడ్డారు. 

ఒక్క‌టి కాదు.. రెండు కాదు.. అనేక స‌మ‌స్య‌ల‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారని విజయశాంతి ఆవేదన వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం కరోనా కూడా ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోందని.. కోవిడ్ స‌మ‌స్య లేకుండా పోతే దూకుడుగా ప‌నిచేద్దామ‌ని బీజేపీ అనుకుందని రాములమ్మ వెల్లడించారు. క‌రోనా వ‌ల్ల కొంచెం నెమ్మదిగా ప‌నులు జ‌రుగుతున్నాయని.. తెలంగాణ‌లో మ‌రోసారి ఉద్య‌మం చేయాల్సిన అవసరం ఉందని, ఆ ఉద్య‌మం బీజేపీ నాయకత్వంలోనే మొదలవుతుందని విజయశాంతి జోస్యం చెప్పారు.

Also Read:18 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిపై న్యాయ నిపుణుల సలహాలు: బండి సంజయ్

బీజేపీ అధికారంలోకి వ‌స్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని... దొర‌ల ప‌రిపాల‌న పోవాలని రాములమ్మ ఆకాంక్షించారు. టీఆర్ఎస్ పాల‌న‌లో అభివృద్ధి జ‌ర‌గ‌ట్లేదని.. తెలంగాణ‌లో గొప్ప ప‌రిపాల‌న‌ను అందిస్తామని విజ‌య‌శాంతి స్పష్టం చేశారు. తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తామ‌ని ఆమె ధీమా వ్య‌క్తం చేశారు.