వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.  కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేసినా బీజేపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేసినా బీజేపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని.. సింహంలా పోటీ చేస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని జానారెడ్డి చెబుతున్నారని ఆయన గుర్తుచేశారు.

మరోవైపు.. తెలంగాణ రాజకీయాల్లో శనివారం ఆసక్తికర పరిణామాం చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు.. అధికార బీఆర్ఎస్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు ఫోన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని కోరారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని చెప్పారు. అలాగే ప్రగతి భవన్ మార్చ్ (సీఎం హౌస్ మార్చ్) పిలుపు నిద్దామని సూచించారు. 

Also REad: కాంగ్రెస్‌తో కలవలేం..వైఎస్ షర్మిల ఆఫర్‌పై తేల్చేసిన బండి సంజయ్

సీఎం కేసీఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కలిసి పోరాటం చేయక పోతే ప్రతిపక్షాలను తెలంగాణలో కెసిఆర్ బ్రతకనివ్వడని కూడా అ్నారు. అయితే ఈ విషయంపై బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు. ఉమ్మడిగా పోరాటం చేసేందుకు మద్దతు తెలిపినట్టుగా సమాచారం. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని.. త్వరలో సమావేశం అవుదామని చెప్పినట్టుగా తెలిసింది. 

మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని కూడా షర్మిలతో రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా సమాచారం. అయితే పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తెలుపుతామని ఆయన పేర్కొన్నట్టుగా తెలిసింది.