Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌తో కలవలేం..వైఎస్ షర్మిల ఆఫర్‌పై తేల్చేసిన బండి సంజయ్

కేసీఆర్ సర్కార్‌పై పోరుకు సంబంధించి వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆఫర్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. కాంగ్రెస్‌తో తాము కలవలేమని ఆయన స్పష్టం చేశారు. 

telangana bjp chief bandi sanjay reacts on ysrtp president ys sharmila phone call
Author
First Published Apr 1, 2023, 6:12 PM IST

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలకు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఫోన్ చేసిన వ్యవహారం తెలుగు రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సంజయ్ స్పందించారు. కాంగ్రెస్‌తో తాము కలవలేమన్నారు. షర్మిలకు ఇదే విషయాన్ని చెప్పామని సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్‌తో పోటీ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 

మరోవైపు.. తెలంగాణ రాజకీయాల్లో శనివారం ఆసక్తికర పరిణామాం చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు.. అధికార బీఆర్ఎస్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు ఫోన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని కోరారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని చెప్పారు. అలాగే ప్రగతి భవన్ మార్చ్ (సీఎం హౌస్ మార్చ్) పిలుపు నిద్దామని సూచించారు. 

Also Read: నిరుద్యోగ భృతి, ఏప్రిల్ ఫూల్స్ డేని లింక్ చేస్తూ.. కేసీఆర్‌పై బండి సంజయ్ సెటైర్లు , ట్వీట్ వైరల్

సీఎం కేసీఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కలిసి పోరాటం చేయక పోతే ప్రతిపక్షాలను తెలంగాణలో కెసిఆర్ బ్రతకనివ్వడని కూడా అ్నారు. అయితే ఈ విషయంపై బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు. ఉమ్మడిగా పోరాటం చేసేందుకు మద్దతు తెలిపినట్టుగా సమాచారం. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని.. త్వరలో సమావేశం అవుదామని చెప్పినట్టుగా తెలిసింది. 

మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని కూడా షర్మిలతో రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా సమాచారం. అయితే పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తెలుపుతామని ఆయన పేర్కొన్నట్టుగా  తెలిసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios