Asianet News TeluguAsianet News Telugu

కవితను నేను ఏం అనలేదు.. మన దగ్గర వాడుకలో వున్న సామెతనే వాడా : బండి సంజయ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తాను ఏం అనలేదని.. తెలంగాణలో వాడుకలో వున్న సామెతను వాడానని రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే బండి సంజయ్ అన్నారు. కవిత విషయంలో తాను తప్పుగా మాట్లాడలేదని సంజయ్ స్పష్టం చేశారు. 

telangana bjp chief bandi sanjay gave explanation to womens commission on his remarks on brs mlc kalvakuntla kavitha
Author
First Published Mar 18, 2023, 2:30 PM IST

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన ఆరోపణలకు గాను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర మహిళా కమీషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను తప్పు చేయలుదు కాబట్టే కమీషన్ ముందు హాజరయ్యానని స్పష్టం చేశారు. అంబర్‌‌పేటలో కుక్క కాటుకు బాలుడు మృతి, సికింద్రాబాద్ అగ్నిప్రమాదం అన్నింటికి మినిస్టర్ కేటీఆరేనని దీనిపై ఆయన స్పందించరా అని సంజయ్ ప్రశ్నించారు. కవితపై కేసుకు సంబంధించి తెలంగాణలో వున్న ఒక సామెతను మాత్రమే వాడాననని ఆయన పేర్కొన్నారు. కవిత విషయంలో తాను తప్పుగా మాట్లాడలేదని సంజయ్ పేర్కొన్నారు. 

పేపర్ లీక్‌కు సంబంధించి ఇప్పటి వరకు పిల్లలకు భరోసా కల్పించే పనిచేయలేదని ఆయన మండిపడ్డారు. కమీషన్‌ను గౌరవించాల్సిన బాధ్యత వుందని.. తాను ఎవరిని కించపరచలేదని సంజయ్ స్పష్టం చేశారు. పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితురాలైన రేణుక కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారేనని ఆయన తెలిపారు. ఈ కేసులో బీజేపీకి సంబంధమున్న చెబుతున్నవారు, రాజశేఖర్ రెడ్డి ఇన్నాళ్లు దొంగతనం చేస్తుంటే ఏం చేశారని బండి సంజయ్ నిలదీశారు. 

Also REad: కవితపై వ్యాఖ్యలు.. రేపు విచారణకు రాలేను, బండి సంజయ్ అభ్యర్ధనపై స్పందించిన మహిళా కమీషన్

ఇక, ఇటీవల బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కవిత అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించే క్రమంలో.. ‘కవితని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా…’ అంటూ  బండి సంజయ్ కామెంట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత వికెట్ పడిపోయిందని.. అతి త్వరలో బీఆర్ఎస్‌లో మరికొంతమంది క్లీన్ బౌల్డ్ అవుతారని అన్నారు. మద్యం కుంభకోణం, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. అయితే కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. 

అటు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌తో పాటు.. ఇటు రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్‌కు వ్యతిరేకంగా శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బండి సంజయ్‌కు, బీజేపీకి వ్యతిరేక నినాదాలు చేయడంతో పాటు.. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. మరోవైపు బండి సంజయ్‌పై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్‌లలో బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదు చేస్తున్నారు. జీహెచ్‌ఎంపీ మేయర్ విజయలక్ష్మితో పాటు.. పలువురు బీఆర్ఎస్ మహిళా నేతలు శనివారం సాయంత్రం గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లగా.. వారికి అపాయింట్‌మెంట్ లభించలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios