తన ఫోన్ పోయిందంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తన ఫోన్ పోయిందంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. పేపర్ లీక్ కేసులో తనను అరెస్ట్ చేస్తున్న సమయంలో ఫోన్ పోయిందని.. అందులో కీలక సమాచారం వుందని బండి సంజయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేటీఆర్‌ను బర్తరఫ్ చేసే వరకు , నిరుద్యోగలకు రూ లక్ష పరిహారం ఇచ్చే వరకు ఉద్యమిస్తామని బండి సంజయ్ తెలిపారు. నా ఫోన్ మాయమవడం పోలీసుల పనేనంటూ ఆయన ఆరోపించారు. మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది నాతో మాట్లాడారని బండి సంజయ్ అన్నారు. నా ఫోన్ బయటకొస్తే కీలక విషయాలు తెలుస్తాయని వాళ్ల దగ్గరే పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. 

Also Read: టెన్త్ పేపర్ లీక్ కేసు .. ఆ విద్యార్ధిని డిబార్ చేయొద్దు : ప్రభుత్వానికి బండి సంజయ్ విజ్ఞప్తి

ఇక, పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. మంగళవారం రాత్రి బండి సంజయ్‌ను కరీంనగర్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి బొమ్మలరామారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. బండి సంజయ్‌ను బుధవారం బొమ్మలరామారం నుంచి వరంగల్‌కు తరలించారు. ఆయనను బుధవారం సాయంత్రం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో సంజయ్‌ను నిన్న రాత్రి కరీంనగర్ జైలుకు తరలించారు. ఇక, ఈ కేసులో బండి సంజయ్‌ను ఏ-1గా పేర్కొన్న పోలీసులు.. ఆయనపై ప్రధాన కుట్రదారు అని అభియోగం మోపారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి బండి సంజయ్‌కు హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.