Asianet News TeluguAsianet News Telugu

జనాభా గణనలో బీసీ కుల గణన : తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

జనాభా గణనలో బీసీల కుల గణన చేయాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ శుక్రవారం నాడు తీర్మానం చేసిది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అన్ని పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించాయి.

Telangana Assembly resolution on Caste census of Backward classes
Author
Hyderabad, First Published Oct 8, 2021, 11:51 AM IST

హైదరాబాద్: జనాభా గణనలో బీసీల కుల గణన కూడా చేయాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ శుక్రవారం నాడు తీర్మానం చేసింది.ఇవాళ Telangana Assemblyలో తెలంగాణ సీఎం kcr  ఈ తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు.ఈ తీర్మానంపై అన్ని పార్టీలు మద్దతును ప్రకటించాయి. 

also read:ఆర్టీసీ ప్రైవేటీకరణపై తేల్చేసిన తెలంగాణ మంత్రి పువ్వాడ

రాష్ట్రంలో 50 శాతం బీసీలున్నారని  తీర్మాణం ప్రవేశ పెట్టే సమయంలో సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.   కుల గణనలో బీసీలకు చోటు  ఇవ్వాలని రాష్ట్రం తరపున కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ఈ విషయమై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. 

కేసీఆర్ ప్రవేశ పెట్టిన తీర్మానంపై విపక్ష పార్టీలు కూడ అభ్యంతరం తెలపలేదు. ఈ తీర్మానం ప్రవేశపెట్టడం పూర్తి కాగానే ఏకగీవ్రంగా సభ తీర్మానాన్ని ఆమోదిస్తోందని స్పీకర్ ప్రకటించారు. దీనికి సభ్యులంతా బల్లలు చరుస్తూ  తమ హర్షం వ్యక్తం చేశారు.


ఫసల్ భీమాపై కేసీఆర్ ఫైర్

దేశంలో పంటల భీమా శాస్త్రీయంగా లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ పంటల భీమాను తొలగించిందని ఆయన గుర్తు చేశారు. పంట నష్టంపై ఎప్పటి నుండో చర్చ జరుగుతుందన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్  పంట నష్టంపై సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ భీమాపై కేసీఆర్ మండిపడ్డారు.

Telangana Assembly resolution on Caste census of Backward classes

వ్యవసాయరంగంపై  పలువురు నిపుణులు సూచనలు చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఈ నివేదికలను కేంద్రం పట్టించుకోలేదని ఆయన విమర్శలు గుప్పించారు. ఫసల్ భీమా యోజన పథకం కింద పెట్టిన నిబంధనలు రైతులకు ఇబ్బందిగా ఉన్నాయని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కేంద్రాన్ని తమ ప్రభుత్వం, తమను కేంద్రం విమర్శించడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. 

ఆహార ధాన్యాలను నిల్వ  చేసేందుకు గాను ఎఫ్‌సీఐ దేశ వ్యాప్తంగా గోడౌన్లను కలిగి ఉందన్నారు. రాష్ట్రాలకు ఆ స్థాయిలో గోడౌన్లు లేవన్నారు కేసీఆర్. కరవు పరిస్థితులు ఏర్పడితే ఈ గోడౌన్లలో నిల్వ ఉంచిన ధాన్యం లేదా ఆహారధాన్యాలను క్షామ పీడిత ప్రాంతాలకు తరలిస్తారని సీఎం చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇటీవల తాను ఢిల్లీకి వెళ్లిన సమయంలో  కేంద్ర మంత్రితో ఈ విషయమై చర్చించినట్టుగా కేసీఆర్ గుర్తు చేశారు.కరవు, వరదలు వచ్చిన సమయంలో పంట నష్టం అంచనాకు కేంద్రం పంపే బృందాలు ఎప్పుడోస్తాయో కూడ తెలియదని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

హైద్రాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదల కారణంగా  సుమారు రూ. 8 వేల కోట్ల నష్టం వాటిల్లిందని కేసీఆర్ చెప్పారు. ఈ విషయమై కేంద్రానికి నివేదిక పంపినట్టుగా సీఎం తెలిపారు. హైద్రాబాద్ లో వరదలు వస్తే కేంద్ర బృందం ఇంతవరకు రాలేదన్నారు.

అబ్దుల్లాపూర్ మెట్ లో  తహసీల్దార్ పై కిరోసిన్ పోసి  ఓ వ్యక్తి తాను చనిపోయిన ఘటనను దృష్టిలో పెట్టుకొని ధరణి పోర్టల్ ను తీసుకొచ్చామన్నారు.కౌలుదారు మార్పులు చేయడం ప్రభుత్వం బాధ్యత కాదన్నారు. గులాబ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకొంటామని సీఎం హామీ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios