Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ ప్రైవేటీకరణపై తేల్చేసిన తెలంగాణ మంత్రి పువ్వాడ

ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయబోమని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.నష్టాలు వస్తున్నప్పటికీ ఆదాయం పెంచుకొనే దిశగా తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి వివరించారు.
 

Telangana minister puvvada Ajay kumar clarifies on RTC privatisation
Author
Hyderabad, First Published Oct 7, 2021, 4:55 PM IST

హైదరాబాద్: ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయబోమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.తెలంగాణ అసెంబ్లీలో గురువారం నాడు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

also read:TSRTC... ఆర్టిసి ఉద్యోగులకు గుడ్ న్యూస్...ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం

ts rtcని ప్రైవేట్ చేసే ఆలోచన తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.  నష్టాల్లో ఉన్న సంస్థలను కేంద్ర ప్రభుత్వం మూసివేస్తోందని ఆయన విమర్శించారు. తాము కేంద్రం మాదిరిగా నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీని ప్రైవేటీకరించబోమని ఆయన తేల్చి చెప్పారు.

diesel ధరల పెంపు ఆర్టీసికి భారంగా మారిందన్నారు.  నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల మార్గంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి puvvada ajay kumar  చెప్పారు.

2020-21 ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ ఆర్టీసీ రూ.2329 కోట్ల నష్టాన్ని మూటగట్టుకొంది.2019-20 ఆర్టీసీ నష్టాలు రూ.1,002 కోట్లుగా ఉంది. కరోనా ప్రభావం కూడ తెలంగాణ ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపింది. అంతరాష్ట్ర సర్వీసులను నిలిపివేయడం కూడ నష్టాలకు కారణమనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

ఈ నష్టాలను కారణంగా చూపి గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో ఆలస్యం జరిగేది. అయితే ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెల మొదటి తేదీనే ఆర్టీసీ కార్మికులకు వేతనాలు అందాయి.

Follow Us:
Download App:
  • android
  • ios