సారాంశం

Telangana Assembly Elections 2023: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగమైన జనసేన-కాషాయ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇరు పార్టీల నేతల మధ్య సీట్ల పంపకం చర్చలు చివరి దశలో ఉన్నాయని ఆయా పార్టీల నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి ప్రధాని మోడీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. 
 

Pawan Kalyan will join Modi Meeting: దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత టాలీవుడ్ నటుడు, జనసేన పార్టీ (జేఎస్పీ) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం హైద‌రాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీతో వేదిక పంచుకోనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో 'బీసీ ఆత్మ గౌరవ' (వెనుకబడిన కులాల ఆత్మగౌరవం) బహిరంగ సభలో మోడీతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభకు హాజరుకావాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి తనను ఆహ్వానించారనీ, ఆ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించానని జ‌న‌సేన అధినేత తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో కాషాయ పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముమ్మ‌రం చేసింది. దీనిలో భాగంగానే నేడు ప్రధాని హైద‌రాబాద్ కు వ‌స్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగమైన జనసేన-కాషాయ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇరు పార్టీల నేతల మధ్య సీట్ల పంపకం చర్చలు చివరి దశలో ఉన్నాయని ఆయా పార్టీల నాయకులు పేర్కొన్నారు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత, గత ఏడాది నవంబర్‌లో విశాఖపట్నం పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రధానిని కలిశారు. ఈ సమావేశం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వస్తుందని సమావేశం అనంతరం ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు తమతో జతకట్టాలన్న ఆయన ప్రతిపాదనపై బీజేపీ ఇంకా స్పందించలేదు. 2014లో రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి పవన్ క‌ళ్యాణ్ మద్దతు పలికారు. జ‌న‌సేన ఎన్నికలలో పోటీ చేయలేదు కానీ ప‌వ‌న్ కూటమి కోసం ప్రచారం చేసారు. మోడీ-టీడీపీ నాయ‌కుడు ఎన్ చంద్ర‌బాబు నాయుడుతో కలిసి కొన్ని బహిరంగ సభలలో ప్రసంగించారు.

2014లో రాష్ట్ర విభజన సమయంలో కట్టుబడి ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వనందుకు జ‌న‌సేన పార్టీ బీజేపీ, తెలుగుదేశం పార్టీలతో విడిపోయింది. 2019లో,జ‌న‌సేన‌, వామపక్ష పార్టీలు, బహుజన్ సమాజ్ పార్టీ (BSP)తో పొత్తులు పెట్టుకుని ఎన్నిక‌ల బ‌రిలో నిలిచింది. అయితే, 175 మంది సభ్యుల అసెంబ్లీలో ఆ పార్టీ కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక పవన్ కళ్యాణ్‌ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు.