14 మందితో సీపీఎం తొలి జాబితా విడుదల: చోటు దక్కింది వీరికే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను సీపీఎం ఆదివారం నాడు విడుదల చేసింది. 14 మందికి సీపీఎం తొలి జాబితాలో చోటు దక్కింది.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో తమ పార్టీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు. తమ పార్టీ అభ్యర్ధులు పోటీ చేస్తున్న జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లలోకి వెళ్లాలని పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తమ్మినేని వీరభద్రం చెప్పారు.
మిగిలిన మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధుల జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్టుగా తమ్మినేని వీరభధ్రం తెలిపారు.సీపీఎంకు అసెంబ్లీలో ప్రాతినిథ్యం ఇవ్వండి, తమ పార్టీకి ప్రాతినిథ్యం దక్కితేనే పేదల ప్రజల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తాయని తమ్మినేని వీరభధ్రం తెలిపారు. చట్టసభల్లో కమ్యూనిష్టులు బలంగా ఉన్న సమయంలో ఉపాధి హామీ చట్టం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన విషయాన్ని తమ్మినేని వీరభధ్రం గుర్తు చేశారు.ఈ విషయాలను నెమరువేసుకోవాలని ఆయన తెలంగాణ ప్రజలను కోరారు.
also read:ఒంటరిపోరుకు సీపీఎం: నాడు కలిసొచ్చినా, నేడు కలిసొస్తుందా?
సీపీఎంతో పాటు వామపక్ష శక్తులను బలపర్చాలని తమ్మినేని వీరభద్రం ప్రజలను కోరారు. సీపీఎం బలపర్చినశక్తులకు సంఘీభావం తెలపాలన్నారు. బీజేపీని గద్దెదించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. బీజేపీ విజయం సాధించే స్థానాల్లో ఏ పార్టీ బీజేపీని ఓడిస్తుందో ఆ పార్టీకి తమ పార్టీ మద్దతిస్తుందని తమ్మినేని వీరభద్రం తెలిపారు.పార్టీ ఎన్నికల మెనిఫెస్టోను కూడ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం విడుదల చేశారు. నల్గొండ, కోదాడ, హూజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
సీపీఎం అభ్యర్ధుల జాబితా ఇదే
1.పటాన్‌చెరు- మల్లికార్జున్
2.ముషీరాబాద్-దశరథ్
3.భద్రాచలం- కారం పుల్లయ్య
4.ఆశ్వరావుపేట-పి.అర్జున్
5.పాలేరు-తమ్మినేని వీరభద్రం
6.మధిర-పాలడుగు భాస్కర్
7.వైరా-భూక్యా వీరభద్రం
8.ఖమ్మం-శ్రీకాంత్
9.సత్తుపల్లి-భారతి
10.మిర్యాలగూడ-జూలకంటి రంగారెడ్డి
11.నకిరేకల్-చినవెంకులు
12. భువనగిరి-నర్సింహ
13.జనగామ-కనకారెడ్డి
14.ఇబ్రహీంపట్టణం-పగడాల యాదయ్య
also read:సీపీఎంతో పొత్తుకు చివరి ప్రయత్నం: అభ్యర్థుల జాబితా ఆపాలన్న జానా, తమ్మినేని రియాక్షన్ ఇదీ...
ఈ నెల రెండో తేదీన ఒంటరి పోరు చేస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. 17 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్టుగా ఆయన తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు విషయమై సీపీఐ, సీపీఎం మధ్య చర్చలు జరిగాయి. సీట్ల సర్దుబాటు విషయమై కాంగ్రెస్ తీరుపై సీపీఎం అసంతృప్తిని వ్యక్తం చేసింది.
గత నెల 31న సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది.ఈ నెల 1న సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. కాంగ్రెస్ తో పొత్తు చర్చలపై చర్చించింది. కాంగ్రెస్ తీరుపై రాష్ట్ర కమిటీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది.అయితే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సూచన మేరకు ఈ నెల 2వ తేదీ వరకు సీపీఎం నేతలు ఎదురు చూశారు. కాంగ్రెస్ నుండి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఒంటరి పోరు చేస్తామని సీపీఎం ప్రకటించింది. ఇవాళ అభ్యర్ధుల జాబితాను కూడ విడుదల చేసింది సీపీఎం నాయకత్వం.