నేడే రెండో లిస్ట్: 45 మందితో జాబితాను విడుదల చేయనున్న కాంగ్రెస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ  రెండో జాబితా ఇవాళ విడుదల కానుంది.  రెండో జాబితాకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఇవాళ ఆమోదం తెలిపింది.

 Telangana assembly elections 2023:Congress To Release Second list of Contesting Candidates lns

న్యూఢిల్లీ:  కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థుల రెండో జాబితాను  ఆ పార్టీ  శుక్రవారంనాడు విడుదల చేయనుంది.  45 మందితో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం  ఇవాళ  న్యూఢిల్లీలో జరిగింది.ఈ సమావేశంలో  53 మంది అభ్యర్థుల జాబితాకు కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపింది. అయితే  45 మందితో రెండో జాబితా విడుదల కానుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ మురళీధరన్ న్యూఢిల్లీలో మీడియాకు చెప్పారు. 

సీపీఐ, సీపీఎంలకు  రెండేసీ అసెంబ్లీ స్థానాలను కూడ  కాంగ్రెస్ కేటాయించింది. అయితే ఏఏ అసెంబ్లీ స్థానాలను కేటాయించాలనే దానిపై  కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతుంది.  లెఫ్ట్ పార్టీలతో  సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క,  మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిలు  చర్చలు జరుపుతున్నారు.

ఇతర పార్టీల నుండి పోటీ కాంగ్రెస్ లోకి వలసలతో పాటు  బీఆర్ఎస్ నేతల కీలక స్థానాల్లో  కాంగ్రెస్ అగ్రనేతలు పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో  11  స్థానాలను ఇంకా ఖరారు చేయలేదు. ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు కాంగ్రెస్ గాలం వేస్తుంది. కొత్తగా పార్టీలో చేరినవారికి  టిక్కెట్టు కేటాయించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొంటాయి.

దీంతో  11 స్థానాలను ఇంకా పెండింగ్ లో ఉంచారు.   45 మందితో రెండో జాబితాను ఇవాళ విడుదల చేయనుంది కాంగ్రెస్. అయితే  జాబితాను  ఇవాళే విడుదల చేయాలా లేదా లెఫ్ట్ పార్టీలతో చర్చలు పూర్తయ్యాక  విడుదల చేయాలనే దానిపై  కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది.  కాంగ్రెస్ జాతీయ నాయకత్వం  నిర్ణయం ఆధారంగా  రెండో జాబితా విడుదల కానుందని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.

ఈ నెల  15వ తేదీన  55 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది.  ఈనెల  20వ తేదీనుండి రెండో జాబితా కోసం  కాంగ్రెస్ పార్టీ కసరత్తు కొనసాగుతుంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉంది.ఈ దఫా అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది. ఇటీవల కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కర్ణాటకలో అనుసరించిన ఫార్మూలానే  తెలంగాణలో కూడ కాంగ్రెస్ అమలు చేస్తుంది.  

also read:11 స్థానాలు పెండింగ్: 53 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ ఎన్నికల కమిటి క్లియరెన్స్

ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కనుగోలు  సర్వే రిపోర్టుతో పాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ రూపొందిస్తుంది. గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ జాబితాలో చోటు కల్పించాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఇతర పార్టీల్లోని బలమైన నేతలకు  కూడ కాంగ్రెస్ పార్టీ  గాలం వేస్తుంది.ఈ క్రమంలోనే  కొన్ని టిక్కెట్లను  పెండింగ్ లో పెట్టిందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios