Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో అడుగుపెడితే యూపీ సీఎం యోగిని చంపేస్తారట..: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు వస్తే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తారట... తనను కూడా వదిలిపెట్టమంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేసాడు. 

Telangana Assembly Elections 2023 ... BJP Leader Raja Singh Sensational comments AKP
Author
First Published Oct 26, 2023, 6:50 AM IST

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బిఆర్ఎస్, ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ప్రధాన పార్టీల నాయకులంతా ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. ఈ మాటలయుద్దం కాస్తా శృతిమించి నాయకులు బహిరంగంగానే దాడులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రినే చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ బిజెపి ఎమ్మెల్యే వ్యాఖ్యలు కలకలం రేపుతున్నారు.

బిజెపి తరపున ప్రచారం చేపట్టేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిని రంగంలోకి దింపుతోది. అయితే తెలంగాణలో ప్రచారానికి వచ్చే యోగిని చంపేస్తామని తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హిందుత్వ ఎంజెండాతో రాజకీయాలు చేసే అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ముస్లింలు దైవంగా కొలిచే మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన బిజెపి నుండి కొంతకాలం సస్పెన్షన్ కు గురయ్యారు. తాజాగా ఈ సస్పెన్షన్ ను ఎత్తివేసిన బిజెపి అదిష్టానం తిరిగి గోషామహల్ టికెట్ ను అతడికే కేటాయించింది. దీంతో అతడు తిరిగి తనదైన స్టైల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.  

గోషామహల్ నియోజకవర్గంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేపట్టనున్నట్లు రాజాసింగ్ తెలిపారు. ఈ సమయంలోనే ఆయనతో పాటు తనను కూడా చంపేస్తామని కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి తనను చంపుతామని బెదిరించేవారని... ఇప్పుడు ఏకంగా యూపీ సీఎం ను కూడా చంపుతామని బెదిరిస్తున్నారని రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేసారు.

Read More  బీజేపీ అభ్యర్ధిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బహిరంగ దాడి.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఫైర్..

తనకు ప్రాణహాని వుందని... రక్షణ కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం, పోలీసులదేనని రాజాసింగ్ పేర్కొన్నారు. చాలాకాలంగా తనకు బెదిరింపు కాల్స్ వస్తూనే వున్నాయన్నారు. వీటిని ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి తీసుకువెళుతున్నానని తెలిపారు. తాజా బెదిరింపు కాల్ పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. 

ఇదిలావుంటే తాజాగా బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిపై అధికార బిఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం స‌ృష్టించింది. హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పోటీచేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్ధులతో ఎన్టివి ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానందతో పాటు బిజెపి అభ్యర్థి  కూన శ్రీశైలం గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకే వేదికపై పక్కపక్కనే నిలబడి ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ మాటలయుద్దం కాస్త పరస్పర దాడులకు దారితీసింది. 

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పై ఎమ్మెల్యే వివేకానంద విమర్శలు చేసారు. ఎమ్మెల్యేగా అయిదేళ్ళపాటు పనిచేసినా నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయాడని... అందువల్లే శ్రీశైలం గౌడ్ పై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారని వివేకా అన్నారు. అందువల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ కూడా దగ్గలేదని... తనపై నమ్మకంతో బంపర్ మెజారిటీతో గెలిపించారని అన్నారు. 

ఈ వ్యాఖ్యలపై కూన శ్రీశైలం గౌడ్ స్పందిస్తూ... తాను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వ్యక్తినని గుర్తుచేసారు. కానీ టీడీపీ నుంచి గెలిచిన వివేకానంద రూ.10 కోట్లకు అధికార పార్టీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు భూకబ్జాదారు, అవినీతిపరుడు అంటూ ఆరోపణలు గుప్పించుకున్నారు. తొలుత ఇరువురి మధ్య వాద్వాగం జరిగింది. ఆ వాగ్వాదం కాస్తా దాడికి దారి తీసింది. 

ఎమ్మెల్యే వివేకానంద తన స్థానం నుంచి ముందుకు వచ్చి కూన శ్రీశైలం గౌడ్‌పై దాడి చేశాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వివేకానంద.. కూన శ్రీశైలం గౌడ్ గొంతు వద్ద పట్టుకొని వెనక్కి నెట్టారు. ఒక్కసారి అక్కడి ప్రాంతం ఉద్రిక్తతకరంగా మారింది.వెంటనే ఛానల్ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరుపార్టీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఫర్నిచర్ ధ్వంసం చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios