Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ అభ్యర్ధిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బహిరంగ దాడి.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఫైర్..

కుత్బుల్లాపూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ నేతలు రౌడీల్లా దాడి చేయడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు.

BRS MLA Quthbullapur Vivekananda attacked BJP K. Srisailam Goud. BPJ LEADERS FIRE KRJ
Author
First Published Oct 26, 2023, 3:40 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. తాజా ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో అంతకు మించి అన్నట్టు ఓ పరిణామం చోటచేసుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల మధ్య వాగ్వాదం జరిగింది . అది కాస్తా.. దాడికి దారి తీసింది.   

ఎన్టీవీ నిర్వహించిన 'గెలుపెవరిది' కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద దాడికి పాల్పడ్డారు. ఈ బహిరంగ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ తాజాగా ఈ బహిరంగ దాడిపై  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ గూండాయిజానికి ఇది హాల్ మార్క్ అంటూ పేర్కొన్నారు.

పోటీలో ఉన్న ప్రతిపక్ష అభ్యర్థిపై అధికార పార్టీ అభ్యర్థి బహిరంగంగా దాడి చేయడం, గొడవ చేయడం దిగ్భ్రాంతికరమని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే.. సామాన్య ప్రజలపై కూడా ఇదే తరహా దాడులు జరుగుతాయని నిలదీశారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నగరంలోని వేల కోట్ల భూములను కబ్జా చేశారనీ, ఆపై వీధి గూండాల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శలు సాధారణమని, కానీ ఇలా భౌతిక దాడులకు దిగడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశఆరు. కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద ప్రవర్తించిన తీరును ఖండించారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం చేత కాక దాడి చేశారని, ఇది పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. గొంతు నులిమి దాడి చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

బండి సంజయ్ ఫైర్ 

ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ నాయకులు ప్రత్యర్థ పార్టీ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. భౌతిక దాడులతో భయాందోళనలు సృష్టించి గెలవాలని ప్రయత్నిస్తున్నారని అన్నిరు. బీజేపీ నేతలు తల్చుకుంటే.. ఏ ఒక్క బీఆర్ఎస్ నేతలు రోడ్లపై తిరగలేరని, ఖబడ్డార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. సహనాన్ని చేతకానితనంగా భావించొద్దని సూచించారు. కూన శ్రీశైలంపై దాడికి పాల్పడిన బీఆర్ఎస్ అభ్యర్ధి వివేకనందాపై వెంటనే కేసు నమోదు చేయాలని, ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

మాటల యుద్ధం... 

ఎన్టీవీ అనే న్యూస్ ఛానెల్ గెలుపెవరిది అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ... అంతకు ముందు కూన శ్రీశైలం గౌడ్ ఎమ్మెల్యేగా అయిదేళ్ళపాటు చేశారని, కానీ, ఆ తర్వాత ప్రజలు ఆయనపై అసంత్రుప్తి వ్యక్తం చేశారనీ, దీంతో ఆయనకు డిపాజిట్ కూడా దగ్గలేదని అన్నారు. అసలు ఆయన ఏ పని చేయలేదని, అందుకే ఓటమి పాలైయ్యారని ఎద్దేవా చేశారు.  

దీనిపై కూన శ్రీశైలం గౌడ్ స్పందిస్తూ... తాను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వ్యక్తినని, కానీ, టీడీపీ నుంచి గెలిచిన వివేకానంద రూ.10 కోట్లకు అధికార పార్టీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు భూకబ్జాదారు, అవినీతి పరుడు అంటూ ఆరోపణలు గుప్పించుకున్నారు. తొలుత ఇరువురి మధ్య వాద్వాగం జరిగింది. ఆ వాద్వాగం కాస్తా దాడికి దారి తీసింది. 

ఈ సమయంలో ఎమ్మెల్యే వివేకానంద తన స్థానం నుంచి ముందుకు వచ్చి కూన శ్రీశైలం గౌడ్‌పై దాడి చేశాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వివేకానంద.. కూన శ్రీశైలం గౌడ్ గొంతు వద్ద పట్టుకొని వెనక్కి నెట్టారు. ఒక్కసారి అక్కడి ప్రాంతం ఉద్రిక్తతకరంగా మారింది.వెంటనే ఛానల్ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరుపార్టీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఫర్నిచర్ ధ్వంసం చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios