తనపై పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారనే బాధతో ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మంచిర్యాలలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మంచిర్యాలలోని సున్నంబట్టి వాడ ప్రాంతానికి చెందిన సాగర్(24) అనే యువకుడు స్థానికంగా పెయింటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా... సాగర్ సోమవారం తన స్నేహితులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నాడు.

ఈ హోలీ సంబరాల్లో భాగంగా సాగర్ మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులో తమ ఇంటి పక్కన ఉండే ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. బాలిక చెయ్యి పట్టుకొని వేధించాడు. కాగా.. తమ కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి బాలిక తల్లి చూసింది.

Also Read ఆ రెస్టారెంట్ కి ఎవరూ వెళ్లొద్దు.. కరోనా వైరస్ సోకిందంటూ ప్రచారం...

దీంతో వెంటనే ఆమె తన కుటుంబసభ్యులకు విషయం తెలియజేసి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు  పోలీసులు పోస్కో చట్టం  కింద కేసు నమోదు చేశారు. కాగా..   తనపై కేసు నమోదవ్వడాన్ని సాగర్ తట్టుకోలేకపోయాడు.

తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. ఏమైందో తెలీదు సడెన్ గా తన బైక్ లోని పెట్రోల్ తీసి ఒంటి మీద పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. గమనించిన పోలీసులు వెంటనే అతనిని రక్షించే ప్రయత్నాలు చేశారు.

అప్పటికే అతని శరీరం 40శాతం కాలిపోయింది. కాగా... అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం సాగర్ ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.