కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ పరీక్షల్లో సాంకేతిక సమస్యలు: నాచారంలో అభ్యర్ధుల ఆందోళన

కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ పరీక్షకు సంబంధించి  టెక్నికల్ సమస్య నెలకొనడంతో   అభ్యర్ధులు  పరీక్ష  రాయలేకపోయారు.దీంతో  అభ్యర్ధులు ఆందోళనకు దిగారు.  

Tech glitches high Court  Junior Assistant Exam Students in Hyderabad


హైదరాబాద్:: కోర్టుల్లో  జూనియర్  అసిస్టెంట్  పరీక్షల భర్తీ  కోసం  నిర్వహించిన పరీక్షల్లో గందరగోళం  నెలకొంది.  ఆన్ లైన్ పరీక్షల్లో  సాంకేతిక  సమస్యలు  నెలకొనడంతో  అభ్యర్ధులు  ఆందోళనకు దిగారు. 

హైద్రాబాద్  నాచారంలోని  పరీక్షా కేంద్రంలో  పరీక్షకు  హాజరైన  అభ్యర్ధులకు సాంకేతిక  సమస్యలు ఇబ్బందిని కల్గించాయి.  టెక్నికల్   సమస్యతో  అభ్యర్ధులు   పరీక్ష రాయలేకపోయారు.  నాచారం పరీక్షా కేంద్రం ముందు అభ్యర్ధులు బైఠాయించి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్  చేశారు. అభ్యర్ధుల  ఆందోళనతో   కొంతసేపు ఉద్రిక్తత  నెలకొంది.  దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.   తమకు న్యాయం  చేయాలని అభ్యర్ధులు  డిమాండ్  చేశారు.

 రాష్ట్రంలోని  పలు  జిల్లాల్లోని  కోర్టుల్లో  275  జూనియర్ అసిస్టెంట్  పోస్టులను భర్తీ చేసేందుకు  ఇవాళ ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించాలి.  కానీ  సాంకేతిక సమస్యల తో  ఆన్ లైన్ లో  అభ్యర్ధులు  పరీక్షలు రాయలేదు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios