పంజాగుట్టలో కుటుంబ సభ్ములతో టీచర్ల నిరసన: అరెస్ట్ చేసిన పోలీసులు
తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులతో టీచర్లు ఆదివారం నాడు ఆందోళన నిర్వహించారు. ఆందోళన నిర్వహించిన టీచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమండ్ చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి టీచర్లు ఆదివారం నాడు పంజాగుట్టలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఆందోళనకు దిగిన టీచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ వైపునకు కొందరు టీచర్లు ప్రయత్నించారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 317 జీవో ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన నిర్వహించారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కూడా ఉపాధ్యాయులు చెబుతున్నారు. అంతేకాదు భార్యాభర్తలను ఒకే జిల్లాకు బదిలీ చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుల ఆందోళనతో ట్రాఫిక్ కు ఇబ్బంది ఏర్పడింది. ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టాలని నిర్ణయం తీసుకుంంది. ఈ ప్రక్రియకు సంబంధించి మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు..ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాలతో మంత్రులు చర్చించారు. ఉపాధ్యాయ బదిలీలపై ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఉపాధ్యాయ బదిలీలలో తమకు కూడా అవకాశం కల్పించాలని 317 జీవో కింద బదిలీ అయిన ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. వీరితో పాటు భార్యాభర్తలను ఒకే జిల్లాకు బదిలీ చేయాలని కూడా ఉపాధ్యాయులు కోరుతున్నారు.
also read:ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. బదిలీలు, పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్
భార్యాభర్తలను ఒకే జిల్లాకు బదిలీ చేయాలని భార్యాభర్తలైన ఉపాధ్యాయులు నిన్న విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఆందోళన నిర్వహించిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు పెండింగ్ లో ఉన్నాయి. ఉపాధ్యాయుడు ఎనిమిదేళ్లు, ప్రధానోపాధ్యాయుడు ఐదేళ్లకు మించి పనిచేయవద్దు.ఇలాంటి అంశాలను ప్రాతిపదికన తీసుకొని ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టనున్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి టీచర్ల సంగాలకు చెందిన నేతలతో మంత్రులు చర్చించారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించిన అంశాల ఆధారంగా టీచర్ల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది.