ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్‌ గుడ్ న్యూస్.. బదిలీలు, పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్

సంక్రాంతి పండగ వేళ తెలంగాణలోని ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ  ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

Government good news to teachers over transfers and promotions

సంక్రాంతి పండగ వేళ తెలంగాణలోని ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ  ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ అధికారులతో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి జరిపిన సమావేశంలో నిర్ణయం తీసుకన్నారు. ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ మరో రెండు, మూడు రోజుల్లో విడుదలకానుంది. 

గత కొంతకాలంగా పదోన్నతులు, బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్న సంగతి  తెలిసిందే. అయితే ఇటీవల మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల అంశం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో ఉందని చెప్పారు. కొన్ని న్యాయపరమైన చిక్కుల కారణంగా బదిలీలు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను ముఖ్యమంత్రికి తెలుసునని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా విద్యను పిల్లల ఇంటి వద్దకు తీసుకెళ్లడంలో ఉపాధ్యాయులు అద్భుతమైన కృషి చేశారని అభినందించారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios