8 పోలీసు బృందాలు రాత్రింబవళ్లు గాలించినా గోల్డ్ స్టోన్ ప్రసాద్ దొరకుతలేడా? గోల్డ్ స్టోన్ ప్రసాద్ కోసం ఎక్కడెక్కడో వెతికే పోలీసులు సిఎం ఫామ్ హౌస్ లో కూడా వెతకాలి. అప్పుడు ఆయన ఎలా దొరకడో చూద్దాం. భూముల కుంభకోణంలో తన కుటుంబసభ్యుల పాత్ర ఉందని తేలగానే కెసిఆర్ మాట మార్చారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ నోరు విప్పితే కెసిఆర్ కుటుంబసభ్యుల బండారం బయటపడ్తది.

శంషాబాద్ మండలం ఘాన్సీమియగుడ లోని గోల్డ్ స్టోన్ ప్రసాద్ అక్రమిత భూమిలో తెలుగుదేశం పార్టీ జెండాలు పాతింది. పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు సామ రంగారెడ్డి అరవింద్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

కెకె కొనుగోలు చేసిన భూములలో టిడిపి జెండాలు పాతింది. ఆ భూమిలో రైతులతో కలిసి రేవంత్, రమణ నాగలి పట్టి భూమి దున్ని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆక్రమించిన ప్రభుత్వ భూములను రైతులకు అందజేయాలి. లేదంటే రైతుకు భూమి అందించే వరకు రైతులకు వద్దతుగా ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.

గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆక్రమించిన ప్రభుత్వ భూములపై సిబిఐ విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో గడీల పాలన, నిరంకుశ పాలన కోనసాగుతుందన్నారు. కేసిఆర్ కు రైతులే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు బెయిల్ రావడానికి ప్రభుత్వం సహకరించిందని రేవంత్ ఆరోపించారు. సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తరపున లాయర్ ను కూడా పంపలేదని విమర్శించారు. సుప్రీం కోర్టులో పార్థసారధి కి బెయిల్ రాకుండా ప్రభుత్వం తరుపు లాయర్ ఎందుకు వాదించలేదని ప్రశ్నించారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ నోరువిప్పితే కేసీఆర్ కుటుంబ సభ్యుల బండారం బయట పడుతుందన్నారు.