ఏక కాలంలో తెలంగాణ టిడిపికి షాక్ ఇచ్చిన రెబెల్ రేవంత్  రమణ మాటలు డోంట్ ఖేర్ అంటున్న రేవంత్ బాబుకు వివరణ ఇచ్చే వరకు ఎవరితో మాట్లాడను టిడిఎల్పీ జరిగి తీరుతుందని స్పష్టత

రెబెల్ రేవంత్ రెడ్డి మరో బాంబు పేల్చిండు. ఒకవైపు తనకు షాక్ ఇవ్వాలనుకున్న టిఆర్ఎస్ కు ఉల్టా షాక్ ఇస్తూనే సొంత పార్టీలో తనపై కత్తి నూరుతున్న టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణకు ఎదురు తిరిగిండు. రమణ మాటలను తాను పట్టించుకునే ప్రసక్తే లేదని తేల్చి పారేశిండు.

తాజాగా రెబెల్ రేవంత్ రెడ్డి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రేపు వందకు వంద శాతం టిడిఎల్పీ సమావేశం యదాతదంగా జరిగి తీరుతుంది. టిడిఎల్పీ నేతగా నేను చెప్పేదే చెల్లుబాటు అవుతుంది. శాసనసభా వ్యవహారాల్లో పార్టీ నేతలెవరూ జోక్యం చేసుకోవడానికి అధికారం లేదు అని రేవంత్ స్పస్టం చేశారు.

చంద్రబాబు స్వదేశానికి వచ్చే వరకు ఎవరితోనూ ఏ విషయం పైన కూడా మాట్లాడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాను ఇవ్వాలనుకుంటున్న వివరణ ఏదో చంద్రబాబుకే ఇస్తానని మరోమారు స్పష్టం చేశారు. తనపై చంద్రబాబు ఎంతో నమ్మకం ఉంచి తనకు పదవులు కట్టబెట్టారని చెప్పారు. ఆయనకు ఇబ్బంది కలిగించే పనులేవీ చేయబోనన్నారు.

ఇక గోల్కొండ హోటల్ లో జరప తలపెట్టిన టిడిపి, బిజెపి సమావేశం తాలూకు సమాచారం ఏదీ తనకు అందలేదని రేవంత్ పేర్కొన్నారు.

రేవంత్ ఉల్టా తిరగడంతో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో మరింత ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న టెన్షన్ నెలకొంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/tnsQok