తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ను బతుకమ్మ చీరలతోనే ఉరేసి చంపాలని జనగామ మహిళలకు టిడిపి తెలంగాణ అద్యక్షుడు ఎల్ రమణ సూచించారు. ఎంతో ఆశతో చీరలకోసం వెళ్లిన మహిళలకు నాసిరకం చీరలు అందించి, వాటిలో అవకతవకలు పాల్పడగా వచ్చిన డబ్బుతో సింగరేణి ఎన్నికల్లో ఖర్చు పెట్టారని విమర్శించారు. తెలంగాణ ఆడపడుచులకు ద్రోహం చేసిన కమీషన్ డబ్బుతో గెలిచిన సింగరేణి గెలుపు ఓ గెలుపేనా అని దుయ్యబట్టారు. 
జనగామలోని పార్టీ కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశంలో  సీఎం పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. బతుకమ్మ చీరల కమీషన్‌ డబ్బులను ఇబ్బడి ముబ్బడిగా సింగరేణి ఎన్నికల్లో ఖర్చుపెట్టి కేసీఆర్‌ గట్టెక్కారన్నారు.
అలాగే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పెద్ద కబ్జాకోరు అని విమర్శించారు. బతుకమ్మ కుంటను కబ్జా చేసినట్లు స్వయంగా జిల్లా కలెక్టర్ చెబుతున్నప్పటికి ప్రభుత్వ ఎందుకు చర్చలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే ఎమ్మెల్యే పై అనర్హత వేటు వేయాలని అన్నారు.