Asianet News TeluguAsianet News Telugu

రంగంలోకి కేసీఆర్: టీఆర్ఎస్‌లోకి సండ్ర?, ముహుర్తమిదే

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి  మూడో దఫా విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది

tdp mla sandra venkata veeraiah likely to join in trs on dec 26
Author
Khammam, First Published Dec 22, 2018, 8:10 PM IST

ఖమ్మం:  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి  మూడో దఫా విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఈ  నెల 26వ తేదీన వెంకటవీరయ్య టీఆర్ఎస్‌లో చేరుతారని సమాచారం. టీఆర్ఎస్‌లో చేరితే సండ్రకు మంత్రి పదవిని ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. అయితే తాను పార్టీ మారేది లేదని సండ్ర వెంకటవీరయ్య ప్రకటిస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రజా కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకొంది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సీటును కైవసం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.

సత్తుపల్లి అసెంబ్లీ స్థానం నుండి  మూడో దఫా టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించిన సండ్ర వెంకట వీరయ్యతో  టీఆర్ఎస్ రాయబారం నడిపినట్టు సమాచారం.

అదే జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీలు తొలుత సండ్రతో చర్చలు  జరిపినట్టు సమాచారం.ఈ చర్చల సమయంలో పార్టీ మారేందుకు సండ్ర సానుకూలంగా స్పందించలేదని సమాచారం.

ఈ విషయం తెలిసిన  వెంటనే సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగినట్టు ప్రచారం సాగుతోంది. నేరుగా సండ్రతో  కేసీఆర్ మాట్లాడారనే ప్రచారం కూడ ఉంది.

సండ్ర వెంకటవీరయ్యకు మంత్రి పదవిని ఇస్తామని కూడ కేసీఆర్  హామీ ఇచ్చినట్టుగా ఖమ్మం జిల్లాలో ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో  ఈ నెల 26 వతేదీన సండ్ర వెంకట వీరయ్య టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతారని ప్రచారం సాగుతోంది.

దళిత సామాజిక వర్గానికి చెందిన వెంకటవీరయ్యకు  మంత్రివర్గంలో  ఆ కోటా కింద మంత్రి పదవి దక్కే అవకాశం లేకపోలేదు.అయితే జిల్లా నుండి సండ్రకు మంత్రి పదవి దక్కితే చాలా కాలంగా పార్టీలో ఉన్న తమ పరిస్థితి ఏమిటని ఆ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పార్టీ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు వెళ్లినట్టు  సమాచారం. మరోవైపు గత టర్మ్ లో  మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావు పాలేరు నుండి  పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అయితే తుమ్మల నాగేశ్వర్ రావుకు కేబినెట్ హోదా ఉన్న పదవిని కేసీఆర్ కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. సీపీఎం నుండి  సండ్ర వెంకటవీరయ్యను టీడీపీలోకి తీసుకురావడంలో  అప్పట్లో తుమ్మల నాగేశ్వర్ రావు కీలక పాత్ర పోషించారు.

టీడీపీలో తనకు గురువుగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావు 2014 ఎన్నికల తర్వాత  టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన సమయంలో కూడ సండ్ర వెంకటవీరయ్య టీడీపీలోనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ప్రభంజనాన్ని తట్టుకొని కూడ విజయం సాధించారు. దీంతో కేసీఆర్ సండ్ర వెంకటవీరయ్యను టీఆర్ఎస్‌లో చేరాలని ఆహ్వానించినట్టు చెబుతున్నారు.

అయితే తాను  టీడీపీని వీడేది లేదని సండ్ర వెంకటవీరయ్య చెబుతున్నారు. ఇదే జిల్లాలోని ఆశ్వరావు పేట నుండి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన మెచ్చా నాగేశ్వర్ రావును కూడ టీఆర్ఎస్ లో చేరేలా  సండ్రకు టీఆర్ఎస్ నాయకత్వం బాధ్యతలు అప్పగించిందని చెబుతున్నారు.

డిసెంబర్ 22వ తేదీ సాయంత్రం సత్తుపల్లిలోని టీడీపీ కార్యాలయంలో సండ్ర వెంకటవీరయ్య టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ మారేందుకు టీడీపీ కార్యకర్తలు సుముఖతను వ్యక్తం చేసినట్టు తెలిసింది. మంత్రి పదవి ఇస్తేనే పార్టీ మారాలని పార్టీ కార్యకర్తలు సండ్ర వెంకటవీరయ్యకు సూచించినట్టు సమాచారం.

 

సంబంధిత వార్తలు

సండ్ర, మచ్చాలకు టీఆర్ఎస్ గాలం: పార్టీ మార్పుపై తేల్చేసిన ఎమ్మెల్యేలు

కేసీఆర్ దెబ్బ: నాడు టీడీపీ, నేడు కాంగ్రెస్ విల విల

రంగంలోకి ఉత్తమ్: ఆ నలుగురిపై వేటుకు కాంగ్రెస్ డిమాండ్

కేసీఆర్ షాక్: మండలిలో కాంగ్రెస్ఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం

‘ఏపీలో స్పీకర్, ఛైర్మన్ చట్టాన్ని కాపాడుతున్నారు.. కానీ తెలంగాణలో’’

కేసీఆర్ ప్లాన్ ఇదే: మండలిలో కాంగ్రెస్ గల్లంతు

టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ శాసనమండలి ఎల్‌పీ వీలీనం..?

పార్లమెంట్‌ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి: జనవరి నుండి ప్రచారం

పార్టీ అన్యాయం చేయలేదు.. బాబు ప్రచారం నచ్చలేదు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

సీఎల్పీ మీటింగ్ జరగలేదు.. ఎవరు చేయిస్తున్నారో అందరికీ తెలుసు: ఉత్తమ్

Follow Us:
Download App:
  • android
  • ios