Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ ‘ఐటమ్ సాంగ్’ కథ చెప్పిన టిడిపి నేత రావుల

  • రైతు సమన్వయ సమితి జిఓలు రద్దు చేయాలి
  • జెఎసి అఖిలపక్ష సమావేశంలో వక్తల డిమాండ్
tdp leader ravula says item song story

రైతు సమన్వయ సమితి ల ఏర్పాటుపై ఆల్ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. తక్షణమే రైతు సమన్వయ సమితి లకోసం తీసుకొచ్చిన జిఓలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో జీవో 39,42 కి వ్యతిరేకంగా లక్డికపూల్ ప్యాప్సీ హాల్లో  రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం, టీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్  రెడ్డి, సీపీఐ నేత పల్లా వెంకట్  రెడ్డి , న్యూడెమోక్రసీ నాయకులు గోవర్ధన్, టీడీపీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ నాయకులు  గోలి మగుసూదన్ రెడ్డి, టీజేఏసీ నేతలు, ప్రజాసంఘాల సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో టిడిపి నేతల రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ సిఎం కేసిఆర్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాజకీయాల్లో కేసిఆర్ పథకాలు ఐటమ్ సాంగ్ లను తలపించేలా ఉన్నాయని విమర్శించారు. సినిమాల్లో బోర్ రాకుండా మధ్యలో ఐటమ్ సాంగ్స్ పెట్టినట్లు తెలంగాణ రాజకీయాల్లో కూడా సిఎం కేసిఆర్ గడికో ఐటమ్ సాంగ్ వదులుతున్నాడని ఎద్దేవా చేశారు. జనాలంతా ఏదైనా ఇష్యూ మీద చర్చిస్తున్న సందర్భంలో వెంటనే జనాల ఇన్టెన్షన్ మార్చేందుకు కేసిఆర్ ఐటమ్ సాంగ్ లాంటివి వదులుతారని చెప్పారు. రైతు సమన్యయ సమితి మొదలుకొని గొర్రెల పంపిణీ, బర్రెల పంపిణీ, సమగ్ర కుటుంబ సర్వే, సచివాలయ మార్పు లాంటివన్నీ ఐటమ్ సాంగ్ లాంటివేనని విమర్శించారు. రాజకీయ పార్టీలు ఏ అంశం మీద ఫైట్ చేయాలో ఎజెండా కూడా కేసిఆరే సెట్ చేస్తున్నారని అన్నారు. ఎవరి రాజకీయాలు ఎలా ఉన్నా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న రైతు సమన్యయ సమితి విషయంలో జెఎసి గట్టిగా పోరాడాలిన సూచించారు. కేసిఆర్ వదిలిన ఈ ఐటమ్ మీద వదలకుండా ఫైట్ చేస్తే తామంతా మద్దతిస్తామని ప్రకటించారు. లక్షా 70 వేల మంది రైతు సమన్వయ కార్యకర్తలకు గౌరవ వేతనం ఇవ్వాలనుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు రావుల. భూరికార్డుల పరిష్కరణ పేరుతో ప్రభుత్వ రెవెన్యూ ఆధీనంలో ఉండేవి కాస్తా టీఆర్ఎస్ కార్యకర్తలతో కూడిన రైతు సంఘాల చేతిలో పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు కేసీఆర్ మాయలో పడొద్దని హెచ్చరించారు. 

గ్రామాల్లో మళ్లీ దొరల పాలన : కోదండరాం

భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన గ్రామపంచాయతీ వ్యవస్థకు తూట్లు పొడిచే కుట్ర చేస్తుంది కేసీఆర్ సర్కారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా రైతు సమన్వయ సమితి పేరుతో గ్రామ పరిపాలన టీఆర్ఎస్ కార్యకర్తలకు పరిమిత చేయడానికే జీవో 39/తెచ్చారు.  తెలంగాణ సాయధ పోరాటం లో గ్రామ పెత్తందార్లకు వ్యతిరేకంగా చేసారు. జోవో 39 వ్యతిరేకంగా అక్టోబర్ 3 గ్రామ స్థానిక సంస్థల అధికారాల కోసం వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తాం. భూ సమస్య ను పరిష్కరణ చేయాలన్న రికార్డుల ప్రక్షాళన చేయాలన్న చట్టాలను సరళీకరణ చేయాలి. గ్రామాల్లో మళ్లీ పటేల్ పట్వారి వ్యవస్థ తేవడానికి సర్కారు చేస్తున్న ప్రయత్నం ఎండగట్టాలి. గ్రామాల్లో మళ్లీ దొరలు పాలన తేవాలని  కుట్ర చే స్తోంది.

రైతుల హక్కులు కాలారాస్తే ఊరుకోము : ఉత్తమ్

తెలంగాణ నీ జాగీరు కాదు కేసిఆర్.. నీ అబ్బసొత్తు అంతకంటే కాదు. భూ వివాదంలో రైతు సమన్వయ సమితులు ఎలా జోక్యం చేసుకుంటాయి. భూసమస్య రికార్డు సవరణ స్థానిక సంస్థల అధికారులు హరించబడుతాయి. స్థానిక  సంస్థల అధికారాల కోసం 3 అక్టోబర్ నాడు అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతాం.  రైతు సహాయం 4000 పట్టాదారులతో పాటు  పంటవేసిన కౌలుదారులందరికి ఇవ్వాలి. రైతు సమన్వయ సమితి కి 500 కోట్ల ఇస్తారనుకోవడం సరికాదు. టీఆర్ఎస్ 1000 కోట్లు మార్కెట్టు ఇంటర్ వెన్షన్ పండ్ ఇస్తామని ఇంత వరకు కేటాయించలేదు. సర్కారు భూరికార్డులు 90% పూర్తయినాయని పేపర్లు వార్తులు వస్తున్నాయి.

బిజెపి నేత  గోలి మదుసూదన్ రెడ్డి: కిసాన్ మోర్చా

భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమానిక్ గవర్నరు వెల్లడాన్ని ఖండిస్తున్నామన్నారు. గవర్నరును మేము కలిస్తే స్పందన లేదు కాని నేడు గ్రామాలకు వెల్లడం టీఆర్ఎస్ కార్యకర్తలా ఉందీ గవర్నరు వ్యవహారం అని విమర్శించారు. తెలంగాణ సర్కారు నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్నారు. రైతు జేఏసీ పోరాటానికి బీజేపీ కలిసివస్తదని చెప్పారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Follow Us:
Download App:
  • android
  • ios