Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణపై టీడీపీ ఫోకస్.. ఖమ్మం, హైదరాబాద్‌, రంగారెడ్డి స్థానాల్లో గెలిచేందుకు ప్లాన్

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. ఖమ్మం, హైదరాబాద్‌, రంగారెడ్డి స్థానాల్లో తన అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. 

TDP focus on Telangana.. Plan to win Khammam, Hyderabad and Rangareddy seats
Author
First Published Dec 20, 2022, 1:05 PM IST

టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఫోకస్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పలు స్థానాలను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ఖమ్మం , రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కీలక స్థానాలను గెలుచుకోవాలని ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తోంది. వార్డు స్థాయి నుంచి క్యాడర్‌ను పటిష్టం చేయడంతో పాటు తండాలను కలుపుకొని వెళ్లడంపై దృష్టి సారిస్తోంది.

టీడీపీని వీడి ఇతర పార్టీల్లో ఉంటున్న కొందరు నాయకులను మళ్లీ తిరిగి రావాలని పార్టీ ఆహ్వానిస్తోంది. పలువురు నాయకులకు ఇప్పటికే పార్టీ రాయబారాలు పంపించింది. ఇలా వలస వెళ్లిన వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు మళ్లీ టీడీపీలోకి వస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

దారుణం.. 13యేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. కళ్లు పీకేసి, గొంతులో చెక్కముక్క దూర్చి.. గొయ్యి తీసి పాతిపెట్టి

టీడీపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నారు. దీని కోసం ఆయన చురుకుగా ప్రయత్నాలు చేస్తున్నారు. క్యాడర్ బలాన్ని అంచనా వేస్తున్నారు. పార్టీకి విశ్వాసంగా ఉన్న కార్యకర్తలకు, నాయకులకు త్వరలోనే తగిన పదవులు ఇస్తారని వర్గాలు తెలిపాయి. 

“మొదట ప్రతి వార్డులో, గ్రామాల్లో కనీసం 10 మంది నాయకులు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా పార్టీ హైదరాబాద్‌లో పుట్టింది.చాలా మంది కార్యకర్తలు ఇప్పటికీ పార్టీకి విధేయులుగా ఉన్నారు. ఇతర పార్టీలకు మారలేదు. వారికి మేము గిఫ్ట్ ఇస్తాం. వారికి తగిన పదవులు అందజేస్తాం’’ అని ఆ పార్టీ నాయకుడు ఒకరు తెలిపారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం నివేదించింది. 

కొండపల్లిలో వైసిపి వర్సెస్ టిడిపి... మున్సిపల్ ఆపీస్ వద్ద కౌన్సిలర్ల మాటలయుద్దం

కాగా.. పార్టీకి సలహాదారులుగా నియమితులైన మాజీ ఎంపీలు కంభంపాటి రామ్‌మోహన్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి కూడా పార్టీని గ్రామాలు, మండలాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. పార్టీకి విధేయులైన కార్యకర్తలు, నాయకులను గుర్తించి వారికి ప్రత్యేక బాధ్యతలు అందజేయాలని భావిస్తున్నారు. 

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తిరుగులేని కొనసాగింది. 1982 మార్చి 29వ తేదీన టీడీపీని దివంతగ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్థాపించారు. తరువాతి ఏడాది ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. 1983లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తరువాత కూడా ఫలు దఫాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. టీడీపీ కేవలం ఏపీకి పరితమైపోయింది. 

కేటీఆర్ దొర... నిన్ను ఓడించి రిటర్న్ గిప్ట్ ఇస్తాం: సిరిసిల్లలో ప్లెక్సీల కలకలం

2014 ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. తెలంగాణలోని టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి చేరిపోయారు. ప్రస్తుతం ఆ పార్టీకి తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. అయితే తెలంగాణ టీడీపీకి ఇటీవల కొత్త అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను ఏపీ మాజీ సీఎం, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియమించారు. పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకురావాలని ఆ పార్టీ కొత్త అధ్యక్షుడు భావిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios